Hanuman-7 - Hanauman and BheemasEna -హనుమంతుడు - TopicsExpress



          

Hanuman-7 - Hanauman and BheemasEna -హనుమంతుడు భీమసేనుడు. (Hanumadgadatarangini ,hanumadcharithamrutham -41 ) While Arjuna went to get the blessings of Lord Shiva other Paandavaas decided to go for a pilgrimage with Draupadi. One day Bhimasena was relaxing with Draupadi on a river bank near Gandhamaadana forest. In the nice breeze, a flower came and fell in Draupadis lap. It was a beautiful flower with a mind-stealing fragrance. Draupadi told Bhima about her intense desire to get a few more of those. Bhima wanted to please Draupadi and set out in search of the flower called Kalyaana sougandhikam. He walked in the direction of the flowing fragrance from the flowers and on his way he saw an old monkey lying down blocking his way. Bhima did not want to jump across the monkey and requested the monkey to move away from his path. Monkey said he was too old and could not move swiftly. Then Bhima told him to at least move his huge tail to one side so that he could walk by the side and get to the flower bearing trees. Monkey ignored this suggestion and started asking Bhima, who he was and what was the purpose of going to the other side of the forest etc. Bhima was a little irritated by the old monkeys behaviour, but controlling his anger he told him : My name is Bheemasena and I am a Pandava Prince. My father is Vaayu Bhgavaan. Have you heard Aanjaneya or Hanuman who was a great Bhaktha of Lord Rama? I am his younger brother. Hanuman also is the son of Vaayu Bhgaavaan. That is why we are brothers. Anyway, I do not have time to talk to you at length. Please remove your tail or I will have to use force. If you still do not want to move away from my path, I will have to forget that you are an old monkey and will throw you out with the help of my Gada. I came to get the Kalyana sougandhikam flowers for my wife Draupadi. The old monkey told Bhima: Dear Pandava Prince, my pranaams. Please remove the tail to one side by yourself and then you can get the flowers from those trees standing there. Bhima reluctantly touched his tail and tried to move it to one side. At the first attempt it did not move and Bhima used a little bit of his strength and tried again. To his surprise, it did not move even an inch. So he used all his strength and tried to move it and it would not move. He could not believe that he was unable to move the tail of an old monkey lying in front of him. He tried several times and frustrated and embarrassed he asked the monkey: Tell me who you are. You are not an ordinary monkey. I am Bhimasena and I am known for my strength. I have killed the demon Baka and several pillars of strength and this is the first time I am encountering somebody I could not win by my physical strength. Please reveal me who you are. Old monkey slowly sat down near the tired Bhima and told him: My dear younger brother, I am Aaanjaneya or Hanuman, your favorite elder brother. I came here to meet you and bless you. This mountain side is not very safe. So please get the flowers for Draupadi when I am here and we will again meet in the battle field. As per Bhagavaans order, I will remain on the Panadava flags and help you win against the unjust Kauravaas. Saying this Hanumanji embraced his younger brother Bhima and helped him to get the flowers. Bhima also was delighted to see his brother, did namaskaar to him and went back to Draupadi with the Kalyanasougandhikam flowers. Vaayu Bhgavaan embraced both His children by blowing a cool and fragrance filled breeze! ఒకరోజు ద్రౌపది భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్ధాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు. భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేసాడు.ఆ శబ్ధానికి హనుమంతుడు కళ్ళు తెరిచి ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్న వాడిని పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు ఇలా అరవకు అన్నాడు హనుమంతుడు. భీముడు నేను పాండురాజు పుత్రుడను, ధరాజు తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్ధినై వెళుతున్నాను. నాకు దారి వదులు అన్నాడు. హనుమండు నేను ముసలి వాడిని కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి నీ దారిన నీవు వెళ్ళచ్చు అన్నాడు హనుమంతుడు. భీముడు అదెంత పని అని తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు.రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు. భీముడు హనుమంతునితో అయ్యా! మీరెవరో నాకు తెలియదు.కాని మీరు మహాత్ములు. నన్ను మన్నించండి అన్నాడు. హనుమంతుడు భీమునితో భీమా! నేను హనుమంతుడిని, నీ అన్నను వాయు పుత్రుడను. నేను రామబంటును. రావాణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాను అని చెప్పాడు.అది విన్న భీముడు సంతోషించి ఆంజనేయా! నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది. ఒక్క సారి చూపించవా? అని అడిగాడు. హనుమంతుడు భీమా! అది ఎలా కుదురుతుంది. ఆ కాలం వేరు ఈ కాలం వేరు యుధర్మాలు కృతయుగంలో ఒకలా, త్రేతాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది అన్నాడు. భీముడు అన్నయ్యా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా? అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పసాగాడు భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కాని చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం, సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు. తరవాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడుపాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. ద్వాపరయుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి. కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు. తరవాత వచ్చునది కలియుగం. ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్మ వర్తనుడై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం విసేషంగా ఉంటాయి అని హనుమంతుడు చెప్పాడు. భీముడు ఆంజనేయా! అలనాడు నీవు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను అన్నాడు. ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. రెండవ మేరు పర్వతమా అని భ్రమింప చేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు. హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి భీమసేనా! నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షుల, గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు సంతృప్తి చెందుతారు.
Posted on: Fri, 05 Dec 2014 05:12:00 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015