Movie() : Daddy()(2001) Cast : Chiranjeevi, Ashima Bhalla, - TopicsExpress



          

Movie() : Daddy()(2001) Cast : Chiranjeevi, Ashima Bhalla, Simran, Rajendra Prasad Music () : SA Raj Kumar Director() : Suresh Krishna Screenplay : Suresh Krishna Producer () : Allu Arvind Song Lyric : Naa Pranama Singer(s)() : Lyricist() : Release Date : 4th October 2001 Banner : Geetha Arts ||ప|| |అతడు| నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం |ఆమె| అనురాగమా అభినందనం అనుబంధమా శుభవందనం |అతడు| నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది |ఆమె| ఏనాటికీ విడిపోనని చెప్పాలనున్నది |అతడు| మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది |ఆమె| పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది . ||చ|| |అతడు| నడి రేయే నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే |ఆమె| ఈ హాయే చెదరదుగా నా జతగా నువ్వు చెంతనుంటే |అతడు| చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి |ఆమె| చిగురెపుడూ రాలదుగా పచ్చనైన ఆశలకి |అతడు| ప్రేమే పందిరై బ్రతుకే విరబూసే వేళ |ఆమె| మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది |అతడు| పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది ||నా ప్రాణమా || . ||చ|| |ఆమె| ఎడబాటే వంతెనగా నడిపెనుగా నిన్ను చేరుకోగా |అతడు| తడబాటే నర్తనగా నీ నడక నన్ను వెతికిరాదా |ఆమె| సంకోచం తీర్చగా కొత్త బాస చేస్తున్నా |అతడు| సంతోషం సాక్షిగా మూగ భాష వింటున్నా |ఆమె| నీలో లీనమై నేనే నీవనిపించేలా |అతడు| మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది |ఆమె| పదే పదే ఎద నీ మాటే స్మరిస్తు ఉంటుంది || నా ప్రాణమా || youtu.be/FEjkJ9BtsEk
Posted on: Tue, 23 Dec 2014 10:06:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015