ooka telugu abimani pampina post. నేనొక - TopicsExpress



          

ooka telugu abimani pampina post. నేనొక తెలుగుదేశం అభిమానిని మాత్రమె నాయకుడిని కాదు .గతంలో నేను ఎ పార్టీకి తెలుగుదేశంతో సహా ప్రచారం చెయ్యలేదు .నాకు తెలుగుదేశం నాయకులతో ఎటువంటి వ్యక్తిగత పరిచయము లేదు. నాకు కొంచెం ముఖ పరిచయం ఉన్న నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్,దేవినేని ఉమా గార్లు మాత్రమె .వారితో కూడా నాకు సాన్నిహిత్యం లేదు. నేను ఈసారి తెలుగుదేశం పార్టీ గెలిస్తే ,తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందని భావించి తెలుగుదేశం పార్టీకి అభిమానినయ్యాను.చురుకుగా ఉండటానికి కూడా అదే కారణం. నాకు కలిసొచ్చిన అదృష్టం FACEBOOK.దీని ద్వారా మీ అందరికీ దగ్గరి వాడినయినాను.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, చాలామంది యువత ,మీరు politician నా అని అడుగుతున్నారు. నాకు రాజకీయాలపట్ల ఆసక్తి నా చిన్నతనంనుండి ఉన్నది. మాది కమ్యునిస్ట్ కుటుంబం. నా వివాహం తర్వాత నేను తెనాలి లో సెటిల్ అయ్యాను .నా భార్య పినతండ్రి తెనాలి ప్రముఖ రాజకీయనాయకులలో ఒకరైన నన్నపనేని వెంకటరావుగారు. అట్లాకూడా తెనాలి రాజకీయాలను దగ్గరనుండి పరిశీలించి చూసే అవకాసం కలిగింది. అంతకుమించి నాకు రాజకీయపరమైన లింక్స్ ఏమీలేవు. చాలామంది మిత్రులు అడుగుతుండడం వాళ్ళ ఇంత వివరంగా చెప్పాను. తెలుగుదేశం గెలుపు ప్రస్తుత తరుణంలో తెలుగువారికి అత్యంత అవసరమని నమ్మే వారిలో నేను ముందు ఉంటాను. నాకు చేతనయినంత సహాయం పార్టీ కి చేస్తాను. My only dream is to see CHANDRABABU as CHIEFMINISTER Of ANDHRAPRADESH in 2014 జోహర్ ఎన్టీఆర్ జయహో తెలుగుదేశం జై చంద్రబాబు..
Posted on: Thu, 16 Jan 2014 03:31:41 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015