ఈనాటి - TopicsExpress



          

ఈనాటి కవిత-4 _________________________________ అరుణ్ సాగర్ - సౌండ్ ఆఫ్ సైలెన్స్ ఒక అంశం మీద మనసు అనేక రకాల ముద్రలను చేజిక్కించుకుంటుంది.మనసు,వ్యక్తి ఆమేరకే ప్రవర్తిస్తారు.బహుశ:అనుభూతి కవిత్వం,అధివాస్తవిక కవిత్వం,వినిర్మాణ కవిత్వం అనే కవితామాధ్యమాలు తెలుగులో స్థిరపడ్డాక మనసుకు సంబంధించిన అంశాల అధ్యయనం కవిత్వంలో పెరిగిందనే అనాలి.మొదటగా అలాంకారసామగ్రితో,ఆతరువాత కళాతత్వశాస్త్రంతో ఆక్రమంలో తరువాతికాలంలో మనోవైఙ్ఞానిక శాస్త్రం వైపుకు మరలింది. అరుణ్ సాగర్ గారు నిశ్శబ్దం చుట్టూ ఉన్నశబ్దాన్ని అనేక క్రమాలలో అనుభవించిసౌండ్ ఆఫ్ సైలెన్స్ కవితనిచ్చారు.సాధారణ కవితాఛాయలో ఇదంతా నిశ్సబ్దాన్ని గురించి మాట్లాడినట్టు ఉంటుంది కాని,దీని వెనుక మనుష్యులమధ్యన ప్రపంచీకరణ వల్ల ఏర్పడిన నిశ్శబ్దమనే అంశం ఇందులో ధ్వనిస్తుంది.ప్రధానంగా కవిత్వీకరించిన తీరు ఈ కవితలో ఆకట్టుకుంటుంది.కవిత్వ సంబంధంగా సాధారణంగా కవిలో కనిపించే హేతుపూర్వక అభ్యసనం(Rational lerning)ఇందులో ఉంది.విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం,అందులోని అనేక మూలకాల మధ్యనుండే సంబంధాన్ని అర్థం చేసుకోవడం ఇందులో కనిపిస్తుంది.చీకటి,నిశ్శబ్దం,భయం లాంటి మూలాలను అర్థం చేసుకున్నతీరు ఈ కవితలో ఆమార్గంలోనే కనిపిస్తుంది. ఇందులోని అంశాలను వాక్యల పద్ధతిలో గుర్తిస్తేదర్శనం,స్ఫూర్తి,అనుభూతి,అనుభవం,దాన్నుంచి నిర్వచించే చేతనఇవన్నీ వరుసగా కనిపిస్తాయి.మనోవైఙ్ఞానిక శాస్త్రంలో స్రోతస్సు(Channel) అనే పదం ఒకటి ఉంది.కవుల్లో దీనిప్రభావం ఎక్కువ.ఈ మానసిక వ్యవస్థ గ్రాహకాలయిన అంతరంశాల(Inputs)నుంచి ఉత్పాదకత(Output)కు సంకేతాలను పంపుతుంది.పైన చెప్పిన దర్శనం మొదలైన వాహకాలకు ప్రేరణ ఇదే. నిజానికి ఇందులో కనిపించే అంశాలు స్మృతి ఉద్దీపన(Ephoria ecphory)స్మృతికళ (Mnemonics)మొదటిది అంశాలను పున:క్రియాశీలకం చేస్తుంది.రెండవది కొన్ని భౌతికాంశాలలో ఆ ఙ్ఞాపకాన్ని కలిగిస్తుంది. నిశబ్దం!/అనగానే/:ఆట మొదలైనది- ఈ వాక్యంలో మానసికంగా ఒక అంశం యొక్క గ్రాహక ఉత్పాదకభాగాల అనుచలనం కనిపిస్తుంది.ఇలా స్మృతిని పునర్నిర్మించుకోవడాన్ని స్మృతి ప్రతిమ(Memory image)అంటారు. మనిషిలో ఉండే కొన్ని అంశాలను,ఙ్ఞాపకాలను తిరస్కరించడం కూడ ఉత్పాదనలోని భాగం.దీనికి మానసికంగా ఉండే సామాజిక గతిశీలత(Social dynamics) రెండవ అంశంలో కనిపిస్తుంది. ఒక్క స్లయిడు/-సామాజిక నియంత్రణ సాధారణ మానవ మానసిక వ్యక్తిత్వానికి,కవికి మధ్యలో కొన్ని వైరుధ్యాలున్నాయి.భౌతికం ,మానసికం అనే అంశాలే కాకుండా కళలు కూడా ఈ మానసిక శక్తిలో ఉంటాయి. 1.నిశబ్దంతో తొలిపరిచయం/చీకటీ నిశబ్దం కలిస్తే యాంటీ క్లయిమాక్స్/అది నా చెవిలో చెప్పింది అదే ఇంతకూ/:నిశబ్దము ఒక హెచ్చరికా? 2.నిశబ్దంలో జనించే ధ్వని/నేను ఎన్నడో ఏదో ఒక కలలో విని లక్క సీలు వలె/గ్రేమేటర్ ఉపరితలముపై/-ఒక దృశ్యము ప్లస్/-ఒక చితిమంట చిటపట * * * 1.శబ్దం దీపంలా ఆరిపోతే/నిశబ్దమేనా 2.విస్ఫోటించే నిశబ్దం/వానచినుకునీ ఆకు కదలికనీ నీటిసవ్వడినీ కొండచిలువలా మింగే నిశబ్దం 3.కనుక నిశబ్దమూ ఒక శబ్దమే/అగ్నిశిఖ అంచున/కత్తిమొనలా పగిలే శబ్దం 4.కన్నీరు వేసవివాగులా ఎండిపోయినది * * * 1.గుడ్డి వీధిదీపం వెలుగులో/సద్దు చేయకుండా నిలబడ్డ మొండిగోడ -ఇచ్చట ఉచ్చ పోసినవాడు గాడిద! 2.వెన్నులోకి జరజరా పాకినది/కల్లోల కలల సరిహద్దులో కాచుకున్నది/ కలతపలవరింతలను కాటువేసినది మొదటి భాగంలోని రెండు వాక్యాలు మానసిక సంబంధమైనవి,రెండవభాగంలోని వాక్యాలు కళాసంబంధమైనవి,మూడవభాగంలోని వాక్యాలు..భౌతికమైన అనుభవాలు.పూతపెదవులు-కన్నీరు వేసవివాగులా ఎండిపోయినది-సద్దు చేయకుండా నిలబడ్డ మొండిగోడ-ఈ వాక్యాలు మాత్రమే ఒకింత మనుషుల ప్రవర్తనలోని అంశాలను, ఆ నిశ్శబ్దాన్ని వ్యక్తం చేస్తున్నాయి. The statment of poetry are there as a means to manipulation and expression of feelings and attitudes.Hence we must avoid intutive reading and alsoovert literal reading of poems కవిత్వంలోవాక్యాలు అనుభూతులు,దృక్పథాలను నిర్వహించడానికి,వ్యక్తం చేయడానికి సాధనాలు.అందువల్ల వాటిని బుద్ధికి తోచినవిధంగా గాని,నిఘంటువులద్వారాగాని అధ్యయనం చేయటం వదిలెయ్యాలి-అంటాడు ఐ.ఏ.రిచర్డ్స్. ..ఈ క్రమంలోనే రీచర్డ్స్ చెప్పిన మరో అంశం గమనించ దగ్గది.సందర్భం అంటే ఒక రకంగా సంబంధం కలిగిన అంశాలబృందం- A context is a set of entities-నిశ్సబ్దం దాని చుట్టూ ఉండే చీకటి అనే ఆవరణం అది కలిగించే భయం ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకున్న అంశాలు.వీటితోపాటు కొన్ని ఐచ్చిక,భౌతిక అంశాలు ఈ కవితలో ఉన్నాయి.నిశ్శబ్దాన్ని పరిపూర్ణంగా అనుభవించడం.దానినుండి మానసికానుచలనాలు,కళద్వార వ్యక్తమవటం ఈ కవిత చేసింది. 1.1.2015
Posted on: Wed, 31 Dec 2014 16:15:35 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015