ఎందరో మిత్రులు నన్ను ఒక - TopicsExpress



          

ఎందరో మిత్రులు నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నారు ...స్వయం ఉపాధి కోసం ఎమన్నా ఐడియా ఇవ్వండి అని ....వారికి నేను చెప్పదలిచినది ఒకటే , మనకి ఒక కొండరాయి రాయి రాయిగానే కనపడినది కాని ఒక శిల్పికి అందులో ఒక శిల్పం కనిపిస్తుంది ...అలానే మనం కూడా చూసే , ఆలోచించే విధానం మార్చుకోవాలి ...మన ప్రాంతం లో ఎ వస్తువు ఇక్కడ ఉత్పత్తి అవ్వడం లేదు , ఎ సేవలు ఇక్కడ లేవు అనే దాని మీద ముందుగా మనం శ్రద్ధ పెట్టాలి , తరవాత మన budget కూడా ఎంతో ఒక అవగాహనకు రావాలి , కొత్తగా పెట్టె వారికి ఎ బ్యాంకు అంత త్వరగా ముందుకు రాదు , అలాగే మీరు చేసే transactions అన్ని కూడా తప్పనిసరిగా ఒక బ్యాంకు ఎకౌంటు ద్వారా నడపండి , చాలా మంది ఈ పని చెయ్యరు , అలాగే ప్రతి సంవత్సరం మీరు చేసిన వ్యాపారపు ఇన్కమ్ tax returns తప్పనిసరిగా ఫైల్ చెయ్యాలి , లాభం వస్తేనే tax కట్టండి , లేకపోతె only returns ఫైల్ చేస్తే చాలు , టర్నోవర్ 40 లక్షలు దాటితే తప్పనిసరిగా ఆడిట్ చేయించాలి , వ్యాపారం మొదలు పెట్టకముందే నేను ఇవన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇన్కమ్ tax returns కనీసం మూడు సంవత్సరాలవి ( అందులో లాభం కూడా ఉండాలి :) ) ఉంటె ఎ బ్యాంకర్ అయినా మనకు లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు , నాకు తెలిసి స్వయం ఉపాధి లో మూడు ముఖ్యమైన రంగాలు ఉన్నాయి 1, ఫుడ్ (ఆహార వస్తువుల తయారి మరియు మార్కెటింగ్ ) 2, సేవలు ( కంప్యూటర్ సెంటర్ , వాహనాల సర్వీసింగ్ , సెల్ ఫోన్ maintenence ,మొదలైనవి ) 3 , కేవలం మార్కెటింగ్ , అంటే కొందరి దగ్గర కొనడం , వాటిని ఇంకొక చోట అమ్మడం ( బట్టలు మరియు ఇతర ట్రేడింగ్ ) అన్నిటికన్నా ముఖ్యం ,మీరు ఎ వ్యాపారం అయెతే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో ఆ వ్యాపారం చేసే వాళ్ళని మాత్రం సలహా అడగటానికి వెళ్ళకండి , 99.9 % మిమ్మల్ని బెదరగోడతారు , ఎందుకంటే మీరు వాళ్ళకి పోటి అవుతారు గా , (ఇది సహజం) కాస్త స్తిమితంగా కుర్చుని ఆలోచించండి మంచి వ్యాపారం ఎదో మీకే తట్టుతుంది , ఒకటి మాత్రం నిజం వ్యాపారం లో sucess అవ్వాలి అంటే , క్వాలిటీ లో రాజి పడ కూడదు , తక్కువ లాభాలలో చెయ్యాలి , మీరే ఒళ్ళు వంచి శ్రమ చెయ్యాలి , స్టార్ట్ చెయ్యగానే, సినిమా లో చూపించినట్టు ఒక A/C కేబిన్ , రేవోల్వింగ్ చైర్ లో కూర్చుంటే పనులు అవ్వవు . సరయన ప్లానింగ్ , శ్రమ , పట్టుదల , ఓర్పు , ఎప్పుడు చిరునవ్వు తో కస్టమర్స్ ని పలకరించడం , ఇవి కొన్నే విజయానికి సూత్రాలు , మిగతావి అనుభవపూర్వకంగా మీకే తెలుస్తాయి , శుభం
Posted on: Sat, 20 Sep 2014 13:56:19 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015