చదువు రాని వాడవని దిగులు - TopicsExpress



          

చదువు రాని వాడవని దిగులు చెందకు ....మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చిత్రం: ఆత్మ బంధువు (1962) సంగీతం: కె.వి. మహదేవన్ గీతరచయిత: సినారె నేపధ్య గానం: సుశీల పల్లవి: చదువు రాని వాడవని దిగులు చెందకు .. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు .. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు మంచు వంటి మల్లె వంటి మంచి మనసుతో.. జీవించలేని పనికిరాని బ్రతుకులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు .. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చరణం 1: ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగేను ఏ చదువు వల్ల చేపపిల్ల లీదగలిగెను అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను అడవిలోని నెమలికెవడు ఆట నేర్పేను... కొమ్మ పైని కోయిలమ్మ కెవడు పాట నేర్పేను చదువు రాని వాడవని దిగులు చెందకు .. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చరణం 2: తెలివి లేని లేగ దూడ పిలుచుని అంబా అని యేమెరుగని చంటి పాప యేడ్చును అమ్మా అని చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు చదువులతో పని యేమి హృదయం ఉన్న చాలు.. కాయితంబు పూల కన్న గరిక పూవు మేలు చదువు రాని వాడవని దిగులు చెందకు.. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు చదువు రాని వాడవని దిగులు చెందకు.. మనిషి మదిలోన మమత లేని చదువులెందుకు https://youtube/watch?v=R-L26ZMueuM
Posted on: Fri, 23 Jan 2015 16:50:32 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015