దేశం ఇది మన దేశం నీతి - TopicsExpress



          

దేశం ఇది మన దేశం నీతి ఏదో మూల కనిపించే దేశం అవినీతిని పోషించే దేశం దుబారా చేసే ధనమెంతో కానీ పూట గడవడం కోసం రోడ్డున అమ్ముకునే వారి దగ్గర భేరసారాలాడే దేశం ధర్మం అంటే ఎరుగని దేశం అధర్మాన్ని ఆదరించే దేశం ఆకలి కేకలతో శవాలు లేస్తుంటే నేను బాగుంటే చాలు అనుకునే దేశం కుల మతాలను ప్రోత్సహించే దేశం నిజాన్ని అనగదోక్కే దేశం చూసిన నిజాన్ని చెప్పాలంటే భయపడే దేశం పెరుగుతున్న అభివృద్ధికి అనిగిపోతున్న నాగరికత ఉన్న దేశం ఎప్పుడో సంవత్చరానికి ఒకసారి తెల్ల చొక్కాలు వేసుకొని స్టేజీల పైకెక్కి మనుషులంతా సమానమే మనమందరం సమానమే అని చెప్తుంటే విని చప్పట్లు కొట్టే దేశం ఇది మన దేశం .- బుజ్జి లెజెండ్
Posted on: Sat, 23 Nov 2013 16:40:37 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015