పరశురామ్.... పూసిన - TopicsExpress



          

పరశురామ్.... పూసిన పున్నమి వెన్నెలమేన పూసిన పున్నమి వెన్నెలమేన తెలంగాణ వీణ వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాల కోన పదగతుల వాణి స్వర జతుల వేణి ఉప్పొంగి మురిసె ఉల్లముల బాణి తాళాలజోల దరువులయాల సంబురమాడె సింగిడి మేళ మోదుగుపూల వసంతహేళ తంగెడుపూల బంగరు నేల జమ్మికొమ్మన పాలపిట్టల గంతులేసె ఆ జింకపరుగుల యిడుపు యిడుపున జానపదంబులు యింపుగ పూసిన కవనవనంబులు యెగిసిపారె యెన్నెన్నో యేరులు మురిసి ఆడె బతుకమ్మ ఊరుల చరణం 1 నల్లగొండ devarakonda బుద్ధుని పాదపు ముద్రల బండ మన ఫణిగిరి కొండ పద్మ నాయకుల దేవరకొండ మేటి రాచకొండ కొలనుపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ యాదగిరి నరసన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు వడి వడి కలబడి కుడి ఎడమల బడి గడీల పొగరును దించిన దళములు వాడిగ వడిసెల విసిరిన కరములు నందికొండ నీటితోనిండ ఊరు ఊరున పైరులు పండ కరువుల బరువులు జరుగును దూరం నల్లగొండ వరి తరి మాగాణం చరణం 2 రంగారెడ్డి Ananthagirulu పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూల గాలులు కీసరగుట్టలు హరికీర్తనలు శివతత్వంబులు అనంతగిరులు భూమిల దాగిన సలువకొండలు తాండూరు శాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలు కాయలు కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారం కొలువ చరణం 3 వరంగల్ warangal-gullu పాలకుర్తి కవనపుమేళా భాగవతము ఘనపోతన లీల కాకతీయ గణపతి వీర యుగంధరుడు యోచనలో ధీర పాకాల రామప్ప చెరువులు గొలుసుకట్టు జలధార నెలువులు వేయి స్తంభముల శబ్ధ నాదములు పేరిణి భేరిణి నాట్య పాదములు సమ్మక్క సారక్కల తెగువ సర్వాయి పాపన్నని మడువ ఓరుగల్లు అడుగడుగున గుళ్లు తలుచుకుంటే పులకించెను ఒల్లు చరణం 4 కరీంనగర్ rajanna మేటి ఏలికలు శాతవాహనుల కోటిలింగముల పురమీనేల కోడె ముడుపులకు భజన కొలుపులకు వరములిచ్చె రాజన్న లీల ఊరి ఊరిలోన ఉక్కును మించినట్టి కోట ఉబికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాలనేత మేనికి అద్దిన సొగసుల పూత కవనం భువనం ఎల్లలుదాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పూసినతోట చరణం 5 మహబూబ్‌నగర్ palamuru తెలుగు వాకిట పరువంబొలికే కృష్ణవేణి ముఖద్వారం పుప్పొడి మించిన ఇసుక రేణువుల అందమైన దుందుభి తీరం మన్నెంకొండ సిరసనగండ్ల గట్టుకుర్మతీ జోగులాంబ రామగిరి శ్రీరంగాపురములు నల్లమల సలేశ్వరతీర్థం తరాలు గిడిసినవాడని వూడల ఊయలలూపే పిల్లలమర్రి పాలమూరు తల్లి చరణం 6 ఆదిలాబాద్ kuntalajuri కొమురంభీం జోడెన్‌ఘాట్ గిరిజన వీరుల చరితను చాటు మేస్రం జాతి తప్పదునీతి నడిపించే నాగోబాజ్యోతి గోండు కొలన్ ధోటిఆత్రం గుస్సాడినాట్యం నిర్మల్‌సిత్రం బాసర తీర్థం సంగమ క్షేత్రం కుంటాల ఝరి జల సంగీతం ఇప్పటేకు జిట్టారేగు నల్లమద్ధి దిరిశనమాకు అదిలాబాదుకు అడవే సోకు చరణం 7 నిజామాబాద్ domakondakota జైనుల బౌద్ధుల జైనుల బౌధుల బోధనశాల విష్ణు కుండినులు ఏలిన నేల జీనవల్లభుడు హరికేసరుడు పంపకవి ప్రవచించిన బోధలు ఇంద్రపురి కైలాసగిరి బాలకొండ దుర్గాలబరి నల్లరేగడి పుసుపు యాగిడి చెరుకు వెన్నులు పాల జున్నులు పంటసేల తళుకు పల్లె పరవశించి కులుకు పెద్దగుట్ట ఉరుసు బోధను చక్కరయ్యి కురుసు గల గల గల పైరుల మిల మిల నిజామాబాదు సిరులకు కళ కళ గల గల గల పైరుల మిల మిల నిజామాబాదు సిరులకు కళ కళ చరణం 8 ఖమ్మం badrachalam పర్ణశాల పర్ణశాల సీతమ్మ అడుగులు భద్రాచలముల నిత్యవేడుకలు కోనలెంట గోదావరి పరుగులు జంగట కిన్నెరసాని నడకలు పగలే నీడలు పరిచిన చందము పచ్చని టేకు గొడుగులె అందము బొగ్గు బావులు అగ్గి నెలవులు పాల్వంచ ఇలపంచే వెలుగులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరబూసిన చెట్టు ఖనిజ రాశులకు తరగని గట్టు ఉద్యమాల ఖిల ఖమ్మం మెట్టు చరణం 9 మెదక్ metukudurgam మంజీర కంజీరనాదం సింగూరు జల పొంగులహారం సంగమ తీర్థం సాదుల సత్రం ఏడుపాయల శైవక్షేత్రం మెతుకు దుర్గముల మేటి కొలుపులు కోటను మించిన చర్చి తలుపులు చెరివిరాల బాగయ్య దరువులు యక్షగాన ఎల్లమ్మ అడుగులు మల్లినాథుని లక్షణభాష్యం మాటను పాటను పోటెత్తించిన నేతలు కవులను ఇచ్చిన జిల్లా తల్లి మెదకు జిల్లా మలి ఉద్యమాల ఖిల్లా చరణం 10 హైదరాబాద్ hyderabad-akshayapatra మదిలో మెదిలే వదిలిన తావుల మనసుల కదిపే పల్లె గురుతుల బతుకుల యాగం బరువుల రాగం ఉరుకుల పరుగుల బరువుల తాళం మరిపించీ మురిపించే దామం భాగ్యనగరమే ఇంద్రభువనము ఆదరించమని చాచిన దోసిట అక్షయపాత్రే హైదరాబాద్ కుతుబ్‌షాహీ అసఫ్‌జాహీ ఘజల్ ముషాయిర్ సునోరె భాయీ చార్మినారు మక్కామసీదు పురానపూల్ దేఖోరె భాయీ కొబ్బరి తేటను మించిన ఊట ఉస్మాన్‌సాగరు గండిపేట గోలుకొండన ఎగిరేజెండా ఆశలు విరియును ప్రతిఎదనిండా గోలుకొండన ఎగిరేజెండా ఆశలు విరియును ప్రతిఎదనిండా
Posted on: Thu, 22 Jan 2015 10:01:15 +0000

Recently Viewed Topics




© 2015