పోప్‌గారూ... చర్చ్‌లలో - TopicsExpress



          

పోప్‌గారూ... చర్చ్‌లలో పాడుపనేంటి? క్రైస్తవుల మతపెద్ద పోప్‌కు నిలయమైన వాటికన్‌ సిటీపై ఐక్యరాజ్య సమితి కన్నెర్రజేసింది. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేథలిక్ చర్చ్‌లలో బాలలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని మండిపడింది. ఇందుకు కారణమైన క్రైస్తవ మతాధికారులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది. గతంలో కూడా ఈ తరహా నేరాలకు పాల్పడి, వాటిని మరుగుపరచిన మతపెద్దల ఫైళ్లనూ తెరవాలని ఆదేశించింది. బాలల హక్కుల అమలుపై ఐక్యరాజ్యసమితి నియమించిన కమిటీ.. ఈమేరకు ఒక నివేదిక విడుదల చేసింది. పిల్లల హక్కులకు, వారి ఆరోగ్యానికి హామీ ఇచ్చేలా వాటికన్ వెంటనే సంబంధిత నిబంధనలను కఠినతరం చేయాలని గట్టిగా సూచించింది. స్వలింగ సంపర్కం, గర్భనిరోధక సాధనాలు, గర్భస్రావాలపై వాటికన్ తీరుతెన్నులను ఐక్యరాజ్య సమితి కమిటీ తీవ్రంగా విమర్శించింది. అయితే...ఈ నివేదికను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్న వాటికన్ వర్గాలు, తమ వ్యవహారాల్లో యూఎన్ జోక్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. గత రెండేళ్ల వ్యవధిలో దాదాపు 400 మంది క్రైస్తవ పాస్టర్లను విధుల నుంచి తొలగించినట్లు గత జనవరిలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేసింది. లైంగిక వేధింపులకు పాల్పడే పూజారుల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేలా వాటికన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్టు సమాచారం.
Posted on: Fri, 07 Feb 2014 03:41:52 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015