భక్త నామదేవుడు ( - TopicsExpress



          

భక్త నామదేవుడు ( ఇంద్రజీత్ ఖుల్కెర్ గారి వ్యాసానికి స్వేచ్చా అనువాదము , వారికి కృతజ్ఞతలతో) నామదేవ్ మధ్య యుగపు భారత దేశం లో మహారాష్ట్ర కి చెందిన మహాపురుషుడు ఆయన భగవాన్ శ్రీకృష్ణుని సేవకుడు కాదు, భగవానుని సఖుడు . నామదేవుడు భగవానుని అంశ నామదేవుడు మహారాష్ట్ర కే చెందిన మరొక ప్రసిద్ధ భక్తుడు జ్ఞానదేవుని సమకాలికుడు మరియు వయస్సు లో సుమారు ఐదు సంవత్సరములు పెద్దవాడు, క్రీ . శ . 1269 లో ఆయన జన్మించెను ఆయన జన్మించిన కుటుంబం పండరీపుర విఠలుని పరమ భక్తులు. ఆ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఆషాడ మరియు కార్తీక మాసాలలో శుద్ధ ఏకాదశి నాటికి పండరీపుర యాత్ర చేసేవారు. ఆ కుటుంబం యొక్క స్వగ్రామం సతారా జిల్లా లో కరాడ్ వద్ద కృష్ణా నది ఒడ్దున వున్న నర్సిబామని అనే గ్రామం. విఠలుని పరమ భక్తుడు అయిన దామ శెట్టి , జ్ఞాన దేవుని తండ్రి ,తన పరిస్థితిని మెరుగు పరచుకోవడానికి జ్ఞాన దేవుడు జన్మించాటానికి ఒకటి , రెండు సంవత్సరాల పూర్వం పండరీపురం మకాం మార్చెను. నామదేవుడు తన బాల్యం నుంచే మరొక మహా భక్తుడు ప్రహ్లాదుని లాగా ప్రవర్తించేవాడు . అతనికి మాటలు రాగానే సరిగా పలికిన పదం విఠలా అని . అప్పటి నుంచి ఎవరి సహాయం , ఎవరి ఆదేశము లేకుండా నే నిరంతరాయంగా ఆ పవిత్ర నామముని పలుకుతూ వుండేవాడు. ప్రతి రోజు తల్లి గుణా భాయి పూజ కి విఠలుని గుడికి తీసుకు వెళితే మహదానందం చెందేవాడు. సుమారు ఏడు సంవత్సరాల వయస్సులో ఒక జత తాళములు తయారు చేసి నిద్రాహారాలు,చదువు కూడా మాని విశ్రాంతి తీసుకోకుండా భగవానుని భజనలతో, గానం చేస్తూ, నాట్యం చేస్తూ సమయం గడపసాగెను . ఆయన భక్తి ఎంత అమాయకమైనది మరియు స్వచ్ఛమైనది అంటే భగవానుని తన అనుంగు సోదరుని గాను , తోటి ఆటగాని గాను భావించేవాడు. ఒక రోజు తీరిక లేక తల్లి గుణా భాయి ప్రసాదాలని ఒక పళ్ళెరంలో పెట్టి నామదేవుని చేత గుడి కి పంపెను . నామదేవుడు ఆ ప్రసాదముల పళ్ళెరమును విఠలుని ముందు పెట్టి తినమని కోరాడు . అయితే ఆయన స్వీకరించే సూచనలు గానక నామదేవుడు ఎంత బిగ్గరగా విలపించెనంటే, చివరకు ఆ విఠలుడే మానవ రూపంలో వచ్చి ఆప్యాయంగా ఆ ప్రసాదం అంతా స్వీకరించెను. పరమానందంతో , ఖాళీ పళ్ళెరం తో తిరిగి వచ్చిన నామదేవుడు ఈ వైనం అంతా తల్లికి వివరించగా ఆమె ఆశ్చేర్య పోయెను . మరుసటి రోజున గుణా భాయి నామదేవుని కే ప్రసాదం ఇచ్చి పంపుతూ అతనికి తెలియకుండా దేవాలయానికి అతనిని అనుసరించెను . ముందటి రోజు వలెనె భగవానుడు వచ్చి ప్రసాదం స్వీకరించటం కనులారా గాంచిన ఆ తల్లి ఎంతో సంతసించెను. నామదేవుని తలచుకొని ఎంతో ఉప్పొంగిపోయెను. అటువంటి మహా భక్తుని తల్లిగా చేసినందుకు భగవానునికి తన కృతజ్ఞతలు అర్పించెను. అతని సర్వస్వమూ భగవాన్ విఠలుడే భక్తి మినహా మిగతా విషయాలలో నామదేవుడు మొదట తన తల్లితండ్రులను తర్వాత తనభార్యను ఇతర బంధువులను నిరాశకు గురిచేశాడు. .మొదటి నుంచి ఆయనకు లౌకిక విషయాలలో ఆసక్తి ఏమాత్రము లేదు;పాఠశాలలోచదువు పై శ్రద్ధ లేదు;తన తండ్రి వృత్తి అయిన దర్జీ పని పై గాని మరే ఇతర వృత్తి పైన ఆసక్తి చూపలేదు. పగలు రాత్రి విఠలుని సేవే అతని ఏకైక ఆసక్తి. అతని తల్లితండ్రులు వృద్దులు కాసాగారు; కుటుంబ సంపద తరిగి పోసాగింది. నామదేవుడు తన భక్తికి సమంజసమైన సమయం కేటాయిస్తూనే కుటుంబ సౌకర్యాలను కొనసాగించడంలో పాలుపంచుకోవాలని వారి ప్రగాఢమైన కోరిక. ఒక రోజు కొన్ని బట్టలు అమ్ముకు రమ్మని నామదేవుని బజారుకి పంపినారు. కానీ నామదేవుడు వ్యాపారపు మెళకువలు ఏమి తెలియని అమాయకుడు. విలువలు, ధరలు, ధనము వంటి విషయాలు అతనికి అపరిచితములు. కేవలం తండ్రి ఒత్తిడి వలన అతడు బట్టలు తీసుకొని బజారుకి వెళ్ళినాడు. వస్త్రములను విక్రయించటానికి వచ్చిన విషయమును పూర్తిగా మరిచి అతను అక్కడ ఒక రాతి పై కూర్చుని భజన లో నిమగ్నమాయెను. కొన్ని గంటలకు సూర్యాస్తమానం ఆయెను. అది అతను సాయంకాలపు పూజ కి గుడికి వెళ్లవలసిన సమయం. అప్పుడు అతనికి బట్టలు అమ్మని విషయం, దాని ఫలితముగా తండ్రి చే దూషించబడవలసిన స్థితి గురుతుకు వచ్చెను. అతను గుడికి వెళ్ళుటకు చాలా ఆతురముగానుండెను. ఆ ఆతురంలో అతను బట్టలను తను కూర్చున్న రాతికే, ధనం చెల్లించే విషయములో వేరే రాతిని హామీదారుగా వుంచుతూ, మరుసటి దినం ధనం చెల్లించవలసినిదిగా కోరుతూ బట్టలను .అన్నిటిని అమ్మి గుడికి వెళ్ళినాడు. ఈ సంగతి తెలుసుకున్న తండ్రి కోపోద్రిక్తుడై హామీదారుగా వున్న రాతిని పట్టుకురావలసినదిగా ఆజ్ణాపించినాడు. మరుసటి రోజు బజారుకి వెళ్ళిన నామదేవునికి బట్టలు కాన్పించక, తను కూర్చున్నరాయి ధనము ఇవ్వని కారణంగ హామీదారుగా వున్న రాతిని తెచ్చి, ఇంటిలో ఒక గదిలో పెట్టి తాళం పెట్టెను. తర్వాత గుడికి వెళ్ళి విఠలునికి జరిగినదంతా చెప్పి తన కష్టములను విన్నవించుకొనేను. హామీదారుగా వున్న రాతిని చూపమని తండ్రి అడుగగా నామదేవుడు అది మూసిన గదిలో వున్నదని చెప్పి, గుడికి పరుగున పోయెను. ధనమును అడుగుటకు తండ్రి గది తెరవగా ఆయనకు ఆశ్చర్యము కొలుపుతూ అక్కడ ఒక బంగారుపు ముద్ద కనిపించెను. తండ్రి మహదానందపడినను నామదేవుడు మాత్రము ఏమీ పట్టించుకొనలేదు. తనను తండ్రి దూషణలనుంచి రక్షించినందుకు ఆ భగవానుని స్తుతించెను. ఆ రకముగా కాలము గడుచు చుండెను. నామదేవుని వైవాహిక జీవిత విశేషములు కాలక్రమానా నామదేవుడు రాధా భాయిని వివాహమాడెను. రాధా భాయికి లౌకికమైన విషయాల పై ఆసక్తి. నామదేవుని ఆహ్వానించగా విఠలుడు నామదేవుని బిడ్డ నామకరణ ఉత్సవానికి మానవ రూపంలో విచ్చేసి ఆ బిడ్డకి నారాయణ అని పేరిడి, మంచి బహుమతులు ఇచ్చెను. నామదేవుని ఇంటిలో దరిద్రము తాండవమాడసాగేను.నామదేవుడు తన లౌకిక భాధ్యతలను వదిలివైచెను. నామదేవుని తల్లి, భార్య కృష్ణ భగవానుని దూషించసాగిరి. నామదేవుని పాత మిత్రునిగా వైకుంఠపురం కి చెందిన ధర్మశెట్టిగా భగవానుడు నామదేవుని ఇంటికి వచ్చిరాధా భాయికి అద్భుతమైన బహుమతులను ఇచ్చి మాయమాయెను. Parisha భాగవత్ అనే ఒక భక్తుడు రుక్మిణీ దేవి కృప చే ఇనుముని బంగారముగా మార్చగల రాయిని పొందెను. ఒకనాడు ఆ భక్తుని భార్య ఆ రాతిని తన మిత్రురాలైన రాధాబాయికి ఇచ్చెను. రాధాబాయి ఆ రాతిని తన భర్తకు చూపి, అతని భక్తి ఆ భాగవతుని భక్తి ముందు ఎందుకు పనికిమాలినిదని అనెను. నామదేవుడు ఆ రాతిని నదిలో విసరి వేసెను. మరుసటి రోజు ఈ సంగతి తెలిసి ఆ భక్తుడు నామదేవునితో గొడవ పెట్టుకొనేను.నామదేవుడు అతనికి ఆ రాయి విసిరివేసిన చోటుని చూపించెను. ఆ భక్తుడు అక్కడ వెదుకగా అక్కడ అటువంటి రాళ్లు ఎన్నో కాన్పించెను. ఆ భాగవతుడు ఎంతో అబ్బురపడెను. అతడు త్యాగము యొక్క గొప్పదనమును మరియు నామదేవుని ఆధ్యాత్మిక శక్తులను కొనియాడెను. నామదేవునికి తన తల్లితండ్రులు పైన , భార్య బిడ్డల పైన మరియు ఇతర లౌకిక విషయాల పైన ఆసక్తి చూపుట కష్టమవ్వసాగెను. అతని మిత్రులు మరియు ఇతరులు అతనిని ఈ లౌకిక ప్రపంచం లోనికి లాగలేక పోయిరి. ఆయన ఏకైక ఆసక్తి భగవాన్ విఠలుడే.. అతడు భగవానుని ముందు కూర్చుని గంటలు తరబడి భజనలు చేయుచు , భగవానునితో మాట్లాడుచు , ఆధ్యాత్మిక విషయాలు చర్చిస్తూ గడపసాగెను. నామదేవుని ప్రపంచము ఆద్యంతము భగవానుడే ఆయేను. నామదేవుడు పని వదలివైచి గుడిలోనే విఠ లుని నామగానము లో మునిగిపోయెను. అతని తండ్రి ధమాజీ మరణానంతరం తల్లి గుణాబాయి కి, భార్య రాధా బాయి కి పిల్లలకి, ఒక పూట తిండికి, మంచి బట్టలు కి కూడా కరువాయెను. రాధా బాయి నామదేవుని గురించి గుణా బాయికి ఫిర్యాదు చేయుచుండగా విని విఠ లుడు కేశవ సేఠ్ రూపంలో వారిని కలవటానికి వచ్చెను.వారి ఇంటికి వచ్చి తను నామదేవుని మిత్రుని అని అతనిని కలవటానికి వచ్చితిని అని అనెను. రాధా బాయి నామదేవుడు ఇంటిలో లేడని , తర్వాత రావలసినదిగా కోరెను. అంతే కాక ఇంటిలోని వారికే తిండి లేక పోయినా నామదేవుడు ఎప్పుడూ సాధువు లను కూడా భోజనానికి తీసుకు వస్తాడు అనెను. అప్పుడు భగవానుడు తన పేరు కేశవ సేఠ్ అని , నామదేవుడు అప్పులు తో బాధ పడుచు ధనం లేక బాధపడుతున్నాడని అతనికి ఇచ్చుటకు కొన్ని బంగారు నాణెములను తెచ్చితిని అని అనెను. అది విన్న రాధా బాయి ఆయనను లోపలికి వచ్చి కూర్చోనవలసినదిగా కోరెను. అప్పుడు భగవానుడు ఆమెతో నామదేవునికి ఇబ్బంది కలుగచేయవద్దని అడుగుచు ఒక సంచీడు బంగారు నాణెములు ఇచ్చి వారి ఇంటి నుండి వెడలి పోయెను. గుణా బా యి సరకులు తెచ్చుటకు బజారుకి వెళ్ళుట చే ఇది అంతా ఆమెకి తెలియకుండెను. ఆవిద తిరిగి వచ్చుచు గుడికి వెళ్ళి , నామదేవుడు కుటుంబమును పట్టించుకొనుటు లేదని గుడిలోనే కాలం గడుపుచున్నాడని భగవానునికి ఫిర్యాదు చేసెను. తర్వాత నామదేవుని తిట్టి అతనిని ఇంటికి తీసుకు వచ్చెను. వారు ఇంటికి వచ్చేసరికి రాధా బాయి చాలా వంటలు చేసి ఉంచెను. ఇంటి లోని వారందరూ కొత్త బట్టలు మరియు ఆభరణములు ధరించి వుండిరి. ఈ సంపద అంతా చూచి నామదేవుడు చాలా బాధ పడుతూ ఇది అంతా ఎలా వచ్చినదని తల్లిని ప్రశ్నించెను.తనకు ఏమి తెలియదని ఆమె అనెను. అప్పుడు అతడు రాధా బాయి ని అడిగెను, కానీ ఆమె ఏమి జవాబు ఇవ్వలేదు. అంతలో నామదేవుని సేవకుడు వచ్చి జరిగినది అంతా విన్నవించెను . అంతా విన్న నామదేవుడు కనుల నీరు కారుచుండగా దేవుని ఇంత ఇబ్బంది తన కోసము ఎందుకు పడినావని ప్రశ్నించేను. తర్వాత అతను బ్రాహ్మణులను పిలచి ఆ సంపదను అంతా వారికి పంచెను. జ్ణానదేవుని తో సమావేశము తరువాయి భాగం లో అంత వరకు మిగతాది ఆంగ్లము లో చదివి ధన్యులు కా ప్రార్ధన. Meeting with Jnanadev When Namdev was about twenty years of age, he met the great saint Jnanadev at Pandharpur. Jnanadev was naturally attracted to Namdev as a great devotee of Vithoba. That he might benefit from the company of Namdev, he persuaded Namdev to go with him to all the holy places on pilgrimage. Namdev did not want to go, as that would mean separation from Lord Vithoba of Pandharpur. However, wiser counsel prevailed and Namdev was induced to go on pilgrimage. This was the most important period in the life of Namdev. Practically from this time, the two great saints almost never separated till death parted them. The pilgrimage extended to all parts of India and almost all the holy places. On the way, several miracles are reported to have been performed by both Namdev and Jnanadev. Once Namdev and Jnanadev reached the desert of Marwar. Namdev was dying of thirst. They found out a well, but the water was at such a low depth that it was impossible to get it by ordinary means. Jnanadev proposed to assume the form of a bird by his Laghima Siddhi and bring the water up in his beak. But Namdev proved superior to him. He prayed to Rukmini. The level of the water rose miraculously to the surface. The well is seen even today at Kaladji, ten miles off Bikaner. Namdev and Jnanadev came to Naganathpuri. Namdev started Bhajan in the temple. There was a huge crowd. The temple priests were not able to enter the temple and so became angry. Namdev went to the western gate of the temple and spent the night in doing Kirtan. The image of the temple itself turned to his side. A Brahmin of Bidar invited Namdev to do Bhajan in his house. Namdev went there with a large number of devotees. The Sultan mistook them for rebel troops and sent General Kasi Pant against them. The general reported to the Sultan that it was only a religious party. The Sultan ordered that Namdev should be arrested and prosecuted. He asked Namdev to rouse a butchered cow to life or embrace Islam. An elephant was sent to crush Namdev to death. Namdev’s mother requested her son to embrace Islam to save his life. But Namdev was prepared to die. Namdev raised the dead cow to life. The Sultan and others were struck with amazement. Namdev won the admiration of the Sultan and his party. Namdev and Jnanadev met Narsi Mehta at Junagarh; Kabir, Kamal and Mudgalacharya at Kashi; Tulsidas at Chitrakut; Pipaji at Ayodhya; Nanak at a place in the Deccan and Dadu, Gorakhnath and Matsyendranath in other places. When feeding of Brahmins was done by Namdev at the end of his pilgrimage, Vittal and Rukmini became the cooks and servers. They ate out of the very plate which Namdev used. Namdev gained much, during the pilgrimage, from the society of Jnaneshwar and from Nivritti who was Jnaneshwar’s elder brother and Guru, and was able to look on this world with a wider vision as the manifestation of God. As we saw earlier, Namdev’s world began and ended with the Deity ‘Vithoba’ of Pandharpur and he would not recognize any other Deity as the symbol of God. The pilgrimage lasted about five years and during this period Jnanadev advised Namdev to adopt a Guru so that he might be in a position to realise completely the manifestation of the all-pervading God and thus fulfil his own mission in life. Again Namdev hesitated as he thought that such action might alienate his loyalty and devotion to Vithoba. He plainly said that as long as he had the love of Vithoba, he had nothing to desire except constant devotion to Him. In fact, Vithoba was his Guru. It was, however, clear to Jnanadev and other saints in the company that Namdev’s view was rather narrow in the sense that he thought God was centred in the Deity of Vithoba of Pandharpur and they wanted him to acquire the wider vision which they themselves had attained. One day, in such company, Gora, another saint and a potter by trade, was asked to ascertain which of them were half-baked, i.e., had not realised Brahman. Gora took a small, flat wooden board such as he used to prepare or test the pots and began to pat on the head of everybody. When he came to Namdev and patted on his head, Namdev cried aloud thinking he was hurt. Immediately, all the others in the company began to laugh saying that Namdev was only half-baked and had not become fixed in his spiritual position. Adopting a Guru Greatly mortified, Namdev repaired to Vithoba and complained to Him of his humiliation. He said that he saw no necessity for him to have a Guru as he had intimate relationship with Lord Krishna Himself. Lord Krishna said that Namdev did not really know Him. Namdev denied this. Lord Krishna challenged Namdev and asked him to find out His identity that day. Namdev agreed. Lord Krishna took the form of a Pathan horseman and passed before Namdev. Namdev could not recognize the Lord. Namdev agreed to go to a Guru. Lord Vithoba then advised him to adopt Visoba Khechar as his Guru. Visoba Khechar was one of the disciples of Jnanadev and was living at the time at a village called Avandhya. Namdev proceeded to the village immediately and arrived there at about noon. He took shelter in a temple in order to take some rest. There in that temple he saw a man sleeping with his feet on the Deity Itself. Namdev was shocked, woke up the man and rebuked him for this sacrilege. The man was no other than Visoba himself. Visoba replied, O Namdev, why did you wake me up? Is there a single spot in this world which is not permeated by God? If you think that such a spot can be found, kindly place my feet there. Namdev took the feet of Visoba in his hands and moved them to another direction, but the Deity was there. He then moved Visoba in still another direction, but the Deity was there too! Namdev could not find any direction or spot where he could place the feet of Visoba without treading on the Deity. God was everywhere. Having realised this great truth that God had permeated the whole universe, Namdev surrendered himself to Visoba gratefully and humbly. Visoba then advised Namdev at great length. A small portion of Visoba’s advice is given below. If you want to be absolutely happy, fill this world with Bhajan and the sacred Name of the Lord. The Lord is the world itself. Give up all ambitions or desires. Let them take care of themselves. Be content only with the name of Vittal. You need not undergo any hardship or penance in order to go to heaven. Vaikuntha will come to you of itself. Do not be anxious of this life or of your friends or relatives. They are like the illusions of a mirage. One has to spend a short space of time here like the potter’s wheel which goes on rotating even after the potter has left. Make the best of it by keeping the name of Vittal ever in your mind and on your lips and by recognizing Him everywhere and in everyone. This is my experience of life. Pandharpur was established on the banks of the river Chandrabhaga as a sort of boat for people to cross safely this ocean of life. Pandharinath is standing there as the boatman-in-charge to take you to the other side; and the most important point is that He does this without asking for any fee. In this way He has saved crores of people who have gone to Him in surrender. If you surrender to Him, there is no death in this world. After initiation by Visoba, Namdev became more philosophical and large-hearted. His temple was no longer the small narrow space on the banks of the Chandrabhaga, but the whole world. His God was not Vithoba or Vittal with hands and legs, but the omnipotent infinite Being. A few days after Namdev had adopted Visoba as his Guru, he was sitting at a place doing his Bhajan. In the meantime, a dog came to the spot and ran away with the bread he had prepared for his midday meal. Namdev ran after the dog—not with a stick in his hand, but with a cup of Ghee; and he addressed the dog thus: O Lord of the world! Why do You want to eat the dry bread? Take some Ghee along with it. It will taste much better. Namdev’s realisation of Atma was now complete and overflowing. After Namdev had returned with Jnanadev from the long pilgrimage, the latter expressed his desire to take Samadhi at Alandi. Namdev therefore accompanied the party to Alandi as he could not part with Jnanadev. He was with Jnanadev to the last moment. He then accompanied the party until the other brothers, Nivritti and Sopan, and their sister Muktabai, left the world. Namdev has left behind a detailed account of the ends of these four saints in beautiful poems. Namdev was so shocked by these events which occurred within a short space of one year that he himself was left with no desire to live in this world. He took his Samadhi at Pandharpur at the age of twenty-six in 1295 A.D. Namdev was not an author of any big treatise; but he left behind him a large number of Abhangas or short poems, full with the nectar of Bhakti and love towards God. These are exceedingly sweet. Most of these are lost, but there are extant about four thousand Abhangas, which to this day are a great source of inspiration to all who would read them. Some of the Abhangas are found in the Sikh Adi Granth. The essence of Namdev’s message is: Always recite the Name of the Lord. Constantly remember Him. Hear His glory. Meditate on the Lord in your heart. Serve the Lord with your hands. Place your head at His lotus feet. Do Kirtan. You will forget your hunger and thirst. The Lord will be near you. You will attain immortality and eternal bliss. Namdev’s maid-servant Janabai No account of the life of Namdev would be complete without a mention of Janabai. She was a maid-servant in the household of Namdev. Nothing is known of her life except that she was Namdev’s maid-servant. She herself forgot sometimes that she had an existence apart from being the maid-servant of Namdev. In several poems on devotion which she has left behind, she describes herself as ‘Nam’s maid-servant’ or ‘Namdev’s Jani’. She was one of the closest followers of Namdev and had no ambition other than to serve Namdev and sing the praises of the Lord Vithoba. For instance, in one of her poems she sings: Let me undergo as many births in this world as You please, but grant that my desires are fulfilled. They are that I see Pandharpur and serve Namdev in every birth. I do not mind if I am a bird or a swine, a dog or a cat, but my conditions are that in each of these lives, I must see Pandharpur and serve Namdev. This is the ambition of Namdev’s maid. In another place, Janabai writes: Give me only this girl, O Hari, that I shall always sing Your sacred Name. Fulfil my only desire that You will accept my humble homage and service. This is all that I desire. Have mercy on me and fulfil my desires. I want to concentrate my eyes and mind on You and have Your Name on my lips. For this the maid Jani falls at Your feet. That sums up the philosophy of Janabai and how she attained her desired goal. So intense and sincere was her devotion to Vithoba that the Lord Himself used to lighten her household duties, which, as she became old, she found unable to perform. By her service and devotion to God, she completely succeeded in effacing herself and she got completely merged in Him. A great soul—Janabai! And a greater Master—Namdev! ||||||
Posted on: Sun, 05 Oct 2014 17:46:32 +0000

© 2015