మీకు ఏ విషయాలపై వీడియోలు - TopicsExpress



          

మీకు ఏ విషయాలపై వీడియోలు కావాలి? టెక్నాలజీ గురించి కొందరికి చాలా అడ్వాన్స్‌డ్ పరిజ్ఞానం ఉంటే మరికొందరికి నామమాత్రపు నాలెడ్జ్ ఉండి ఉండొచ్చు.. దీన్ని దృష్టిలో పెట్టుకునే స్వతహాగా ఎంతో complicated టాపిక్స్‌ మీద పూర్తి అవగాహన ఉన్నా ఎక్కువ శాతం మందికి ఉపయోగపడే కామన్ టాపిక్స్ గురించి నేను వీడియోలు చేయడం జరుగుతోంది. ఈ నేపధ్యంలో మీకు ఏ విషయాలపై అయినా సందేహాలు ఉండీ, అలాంటి డౌట్లూ, సమస్యలే ఎక్కువ మందికి ఉంటాయని మీరు భావించినట్లయితే ఈ క్రింద కామెంట్ రూపంలో గానీ, [email protected] అనే మెయిల్ ఐడికి మెయిల్ ద్వారా కానీ తెలియజేయండి. మీ రిక్వెస్ట్‌ని పరిశీలించి అధికశాతం మందికి ఉపయోగపడుతాయనుకున్న విషయాల గురించి వీలువెంబడి వీడియోల ద్వారా ప్రాక్టికల్‌గా demonstration చెయ్యడం జరుగుతుంది. మిత్రులు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. ధన్యవాదాలు - నల్లమోతు శ్రీధర్
Posted on: Mon, 23 Sep 2013 08:41:52 +0000

© 2015