మైక్రోసాఫ్ట్ సంస్థల - TopicsExpress



          

మైక్రోసాఫ్ట్ సంస్థల సహ-వ్యవస్థాపకులు బిల్ గేట్స్ మరోసారి ఫోర్బ్స్ 400 మంది అమెరికా ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. గేట్స్ ప్రస్తుత నికర సంపద విలువ $72.1 బిలియన్లు. బెర్కషైర్ హాత్వే ఇంక్ హెడ్ వారెన్ బఫ్పెట్ నికర సంపద విలువ $58.5బిలియన్లతో రెండో స్ధానంలో నిలిచారు. ఒరాకిల్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకులు లారీ ఎల్లీసన్ $41 బిలియన్ల నికర ఆస్థితో మూడో స్థానంలో నిలిచారు. కోచ్ ఇండస్ట్రీస్ సహ-యజమానులు బ్రదర్స్ చార్లెస్ $36 బిలియన్ నికర ఆస్తితో నాలుగో స్థానంలో నిలిచారు. బిల్‌గేట్స్‌కు సంబంధించి పలు ఆసక్తికర నిజాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు... - బిల్ గేట్స్ సంపాదన సెకనుకు $250 యూఎస్ డాలర్లు, రోజుకు $20 మిలియన్. సంవత్స్రానికి $7.2 బిలియన్. - బిల్ గేట్స్ ఓ వెయ్యి డాలర్ల‌ను నేలపై జారవిడిచినట్లయితే వాటిని తిరిగి తీసుకోనవసరం లేదు. ఎందుకంటే గేట్స్ ఆ జార విడిచిన మొత్తాన్ని నాలుగు సెకన్లలో సంపాదించగలరు. - అమెరికాకు ఉన్న అప్పు విలువ షుమారు 5.62 ట్రిలియన్లు. ఈ మొత్తాన్ని బిల్‌గేట్స్ 10 సంవత్సరాల్లో తీర్చగలరు. - బిల్ గేట్స్ ఈ భూమి పై జీవించే ప్రతి ఒక్కరికి US$15 డాలర్‌లను దానం చేసినప్పటికి. ఆయన వద్ద ఇంకా యూఎస్ $5 మిలియన్ సంపద మిగిలి ఉంటుంది. - అమెరికాలో అత్యధిక పారితోషకాన్ని అందుకుంటున్న అథ్లెట్ మైఖేల్ జోర్డాన్. ఈ క్రీడాకారుడి వార్షిక ఆదాయం యూఎస్ $30 మిలియన్లు. మైఖేల్ జోర్డాన్ 277 సంవత్సరాల పాటు తనకు వచ్చే ఆదాయాన్ని ఏ మాత్రం ఖర్చుపెట్టకుండా ఉన్నట్లయితే బిల్స్ గేట్స్ ప్రస్తుత సంపదను మించగలడు. - బిల్ గేట్స్ ఒక దేశమైతే. ఈ భూమి పై 37వ ధనిక దేశంగా బిల్ గేట్స్ ఉంటారు. - ప్రపంచవ్యాప్తంగా ఉన్న మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు తమ కంప్యూటర్ హ్యాంగ్ అయిన ప్రతిసారీ నష్టపరిహారం క్రింది యూఎస్ $1 డాలర్‌ను కోరినట్లయితే. బిల్ గేట్స్ 3 రోజుల్లో అప్పుల పాలవుతారు. మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి. వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి. Read more at: telugu.gizbot/news/bill-gates-stays-atop-forbes-list-of-americas-richest-man-008392.html
Posted on: Thu, 19 Sep 2013 10:35:40 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015