వేదిక - సాహిత్య - TopicsExpress



          

వేదిక - సాహిత్య సమావేశం Tomorrow - Sunday evening 4.30 PM ఈ జరగనున్న సభలో; 1 - శ్రీ మధురాంతకం నరేంద్ర గారి కథ నిశబ్దపు చప్పుడు మీద పాఠకుల విశ్లేషణలతో పాటు. నిశబ్దపు చప్పుడు కథ ఇక్కడ చదువుకోవచ్చు. bit.ly/nishabdapuNeedaByNarendra 2 - డా. సోమరాజు సుశీల గారి కొత్త పుస్తకం ‘ముగ్గురు కొలంబస్‌లు’ నవల పరిచయం ఉంటుంది. దానికి డా. జంపాల చౌదరి గారి ముందుమాట ఇక్కడ చదువుకోవచ్చు: pustakam.net/?p=17176 3 - ఆంగ్ల కథా పరిచయం -౦- ఇక వేదిక గురించి చిన్న పరిచయం ఇక్కడ. 1 - ఇటీవలే వెలువడ్డ ఒక తెలుగు కథ మీద ఒక పరిచయం, విశ్లేషణలు జరగనున్నాయి. 2 - ఒక తెలుగు నవల పరిచయం 3 - ఒక ఆంగ్ల కథ పరిచయం - ఒక పాఠకుడి అభిప్రాయం - పై మూడు అంశాల మీద చర్చలో సభకి విచ్చేసిన సాహిత్యాభిమానులు పాల్గొంటారు. సమయం ఆదివారం సాయంత్రం 4.30 ని నుండి 6.30 ని వరకు మీకు ఇదే సాదర ఆహ్వానం. కూకట్‌పల్లి ప్రాంతానికి దగ్గిరలో ఉన్న మీ సాహిత్యాభిమానులకి తెలియజేయండి. సాహిత్యం మీద ఆసక్తి ఉన్నమీ మిత్రులందరికి కూడ మీమ్మల్ని తెలియజేయమని కోరుకుంటున్నాము. ప్రక్రియ కథ కావచ్చు, నవల కావచ్చు, కవిత కావచ్చు. ప్రబంధాలు, నాటకాలు కావచ్చు. రాయడానికి రచయిత, చదవడానికి పాఠకుడు కావాలి. రచయిత కూడ ఒక పాఠకుడే. ఈ హైదరాబాదులాంటి మహానగరంలో సాహిత్యం మీద అభిరుచి ఉన్నవారు చాలామందే ఉన్నా దురదృష్టవశాత్తు ఆ సాహిత్య సభలు, సమావేశాలు అందరికి అందుబాటులో లేకుండా పోయినవి. ప్రతికూలమైన అంశాలు దూరాలు, ప్రయాణాలు, తగిన సమయం దొరకకపోవడం. కూకట్‌పల్లి హైద్రాబాదులో కొన్నిప్రాంతాలకి నడిబొడ్డు. ఆ చుట్టుపక్కలనున్న సాహిత్యాభిమానులకి ఒక వేదికని అందించడానికి ఆలంబన ముందుకు వచ్చింది. మిగతా వివరాలన్నిఆ రోజున వేదిక దగ్గిర మాట్లాడుకుందాం. ------------------------------------------------------------------------------------ How to reach the venue. వేదిక చేరుకోవడానికి దారి: Kalyan Jewellers building is the land mark visible on the main road. Take the road adjacent to it. Stick to the main road. Pass More departemental store, to your left. You will come across a + junction.. and then Apollo Pharmacy, again to your left, while approaching from the Kukatpally main road. Take the left there and you will find Aalambana to your right. The 3rd building. చిరునామా: HIG 85, Near Vijay Durga Hotel, Balaji Nagar, Beside Vishishta Curries, Kukatpally, Hyderabad - 500072 దారి వివరాలకు రాము - 81065 61671, +(91)-40-23055904, +(91)-9440103189 అనిల్ 81426 42638 Google Map - Weblink : @[NjQyMTgzOTU5MjA4MTA3Omh0dHBzXGEvL2dvby5nbC9tYXBzL0d2ak9pOjo=:https://goo.gl/maps/GvjOi
Posted on: Sat, 13 Sep 2014 10:07:38 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015