శాసనసభలో ప్రజావాణిని - TopicsExpress



          

శాసనసభలో ప్రజావాణిని వినిపిస్తున్న ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నరు. ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరు పట్ల వైఎస్ జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎక్కడా ఎప్పుడూ ఇంత అన్యాయంగా బడ్జెట్ సమావేశాలు జరిగి ఉండవేమో. శాసనసభలో ఉన్నది అధికార, ప్రతిపక్షాలే.. ప్రతిపక్షమన్నది ప్రజల గొంతు కనుక వాళ్ల గొంతు ప్రజలు వినాలనుకుంటారు.. ప్రతిపక్షం గొంతు వినపడేలా అవకాశం కల్పించడం స్పీకర్ ధర్మం. ప్రతిపక్షం గొం తు పూర్తిగా నొక్కేయాలి, వినపడకూడదనే ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు. వాస్తవానికి ప్రజలే నిజమైన ప్రతి పక్షం అందుకే ప్రజల తరఫున తాము మాట్లాడేటపుడు గొంతును వినడానికి అధికారపక్షానికి ఓపిక ఉండాలి, ఆ ప్ర కారం అందరూ మార్పు తెచ్చుకోవాలి. ‘సోమవారం నేను 11.08 గంటలకు ప్రసంగం మొదలు పెట్టాను. ప్రజల సమస్యల మీద, బడ్జెట్‌లో వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల మీద మాట్లాడాను. చంద్రబాబు, అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆ హామీల ఆధారంగా వారు వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులపైనే మాట్లాడాను. ఒక్కదానిపై కూడా నేను డీవియేట్ కాలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు వ్యక్తిగతంగా ఎవ్వరినీ దూషించలేదు. పూర్తిగా సబ్జెక్ట్ మీదే మాట్లాడాను. ఎన్నికలకు ముందు టీడీపీ ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్‌లో వాటికి ఎన్ని కేటాయింపులు చేసిందనే అంశాలు తప్ప వేరే ఏమీ మాట్లాడలేదు. కానీ నా ప్రసంగానికి 17 సార్లు అంతరాయం కలిగించారు. అధికారపక్ష సభ్యు లు అడ్డుతగిలి గంటా ఆరు నిమిషాలపాటు అం తరాయం కలిగించారు. మా పార్టీ నేతలు మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు టీవీలో చూసి స్పష్టంగా అంతరాయాలు ఎన్నిసార్లు, ఎపుడెపుడు జరిగాయని సమయంతో సహా నమోదు చేశారు. 11.08గంటలకు నేను ప్రసంగం ప్రారం భిస్తే ఈ అంతరాయాలు కలుపుకొని మధ్యాహ్నం 1.40 గంటలకు మైక్‌ను కట్ చేశారు. ఈ రెండున్నర గంటల సమయంలో అంతరాయా లు కలిగిస్తూనేపోయారు. రెండు మూడు నిమిషాలు మాట్లాడితే చాలు మైక్ కట్ చేయడం.. అధికారపక్షానికి అవకాశం ఇవ్వడం, మరో నా లుగు నిమిషాలు మాట్లాడాక మళ్లీ మైక్ కట్.. మరో పది నిమిషాలు మాట్లాడిన తరువాత మళ్లీ మైక్ కట్.. బహుశా ఇంతటి అన్యాయమైన పరి స్థితులు ఎవరికీ ఎదురై ఉండవేమో!’’ - వైఎస్ జగన్.
Posted on: Wed, 27 Aug 2014 12:21:50 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015