సీక్రెట్ ఆఫ్ డిజైర్ - TopicsExpress



          

సీక్రెట్ ఆఫ్ డిజైర్ సైకిల్ _______________ దేని మీదైతే కోరిక కోల్పోతామో.. ఆ వెంటనే అది సాఫల్యమవుతుంది.. ఇన్నాళ్లూ కోరుకున్నాం దక్కలేదు.. ఇప్పుడు దక్కింది.. అయినా అంత ఆసక్తి లేదు అనే desire, fulfillment చక్రంలోని phases చాలామంది నుండి తరచూ వింటూనే ఉంటాం. మనం కోరుకున్నది ప్రతీదీ జరుగుతుంది అని law of attractionని ఆధారంగా చేసుకుని మనం చదువుకుని, నమ్మీ.. జరిగినవన్నీ రిలేట్ చేసుకునీ.. నరనరానా జీర్ణించుకున్న విషయం. ఏ క్షణమైతే ఒక విషయం మీద కోరిక నశిస్తుందో ఆ క్షణం అది నెరవేరుతుంది అన్నది నేను వ్యక్తిగతంగా నా జీవితంలోనూ, అనేకమంది జీవితాల్లోనూ గమనించి తెలుసుకున్న వాస్తవం. ప్రతీదీ కోరుకోండి.. కొన్నాళ్లకు ఆ కోరిక పట్ల ఆసక్తి పోగొట్టుకోండి.. ఆ కోరిక ఎంత అల్పమైనదో గ్రహించండి.. అంతకన్నా గొప్ప జీవితం ఉన్నదని గ్రహించండి.. thats it. అల్పమైన కోరికలు అన్నీ కళ్ల ముందు జీవం కోల్పోయి సాకారం అవుతుంటాయి. వద్దనుకున్నప్పుడు వచ్చీ లాభమేంటి అని చిరాకు పడకండి.. కాక్షించడం శక్తితో సమానం.. నిరుత్సాహపడడం శక్తిని హీనింపజేస్తుంది.. శక్తికీ, శక్తిహీనతకూ మధ్య జరిగిన చిత్తచాంచల్యాన్ని గ్రహించి.. మనస్సు నుండి కోరికను త్యజించడం ultimate thing. ఆ అల్టిమేట్ స్థితిలోనే అన్ని కోరికలూ నెరవేరతాయి.. దేని పట్లా అటాచ్‌మెంట్ ఉండదు.. చిరునవ్వుతో అన్నీ చూస్తుండిపోతారు. - నల్లమోతు శ్రీధర్
Posted on: Sun, 27 Jul 2014 16:39:02 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015