Danny Notes 22 September 2014 నేను academic Counselor - TopicsExpress



          

Danny Notes 22 September 2014 నేను academic Counselor ని కాను! చాలా మంది FB Friends నన్ను Personality development coach అనుకుంటున్నట్టున్నారు. నన్ను కలవాలనీ, నా సలహాలు తీసుకోవాలనీ చాలా మంది ఛాట్ లో అడుగుతున్నారు. ఫోన్లు చేస్తున్నారు. చివరకు భార్యాభర్తల వివాదాలు, సంతాన సాఫల్యం వగయిరా అంశాలు కూడా నా దగ్గర ప్రస్తావిస్తున్నారు. మీకందరికీ మనవి చేసేదేమంటే నేను academic Counselor ని కాను. పైగా ఫోను చేసే ప్రతివారికీ సమయాన్ని కేటాయించే తీరికా నా రోజువారీ జీవితంలో లేదు. స్వాంతన కోసం ఒకరిద్దరితో మాట్లాడగలను. గానీ ,ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం సాధ్యంకావడం లేదు. నాకు తల్లీ, భార్యా, వయసులోవున్న ఇద్దరు కొడుకులు, పొట్ట కూటి కోసం ఆఫీసు, ఇంకో స్వేఛ్ఛా వృత్తి, నా హాబీలు వగయిరా వున్నాయి. ఏవో ఇబ్బందుల్లో వుండి నాకు ఫోన్ చేసేవారి మీద నాకు సానుభూతే వుంటుందని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటావున్నాను. మీ ఫోన్లకుగానీ, నన్ను కలుస్తానన్న మీ ప్రతిపాదనలకు గానీ అనివార్య కారణాలవల్ల నిరాకరిస్తే నా మీద అలగవద్దని వినయంగా మనవి చేసుకుంటున్న. ఈ సమస్యకు అందరికీ ఉపయోగపడే పరిష్కారం ఏదైనా వుందేమోనని నేను ఆలోచిస్తున్నాను.
Posted on: Mon, 22 Sep 2014 16:25:55 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015