POST OF SRI Srinivas Rao Avvaru GARU AND FOLLOWS MY REPLY PLEASE - TopicsExpress



          

POST OF SRI Srinivas Rao Avvaru GARU AND FOLLOWS MY REPLY PLEASE READ ఈ పేజ్ లో చాలా మంది మేధావులు ... చక్కటి విశ్లేషణా సామర్ధ్యం ఉన్నవారు ఉన్నారు... దురద్రుష్టవశాత్తు....అంతా కేవలం హిందూ ధర్మం మీద మాత్రమే విమర్శలు గుప్పిస్తున్నారు... మీరు ఇక్కడ అనేవీ ..వ్రాసేవీ... అన్నీ కూడా శతాబ్దాలుగా చర్చించ బడుతున్నవే .... చర్చ మంచిదే దానికి ఎక్కడో ఒక చోట లాజిక్ ఎండ్ వస్తుంది... కానీ ఇక్కడ చర్చ కంటే కూడా దూషణలు ఎక్కువ అయ్యాయి... దయచేసి ISIS లాటి వాటిమీద దేశంలో చాలా చోట్ల విస్తరిస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదం మీద.... మత మార్పిళ్ళ మీద కూడా చర్చ జరిగితే బావుంటుంది... అలానే మతం మారి .. కులం మారకుండా ఉన్నవారి పట్ల కూడా మీ మీ అభిప్రాయాలు చెప్తే దాని మీద కూడా చర్చిద్దాం.. ---------------------------------------------------------------------------------------------------- అయ్యా శ్రీనివాస రావు గారు, నమస్కారం, మీరు మంచి పాయింట్ చెప్పారు. దేశం లో ఇన్ని సమస్యలు ఉండగా, ``అయోధ్య రామాలయం`` `` భారత దేశాన్ని హిందు దేశం గా చెయ్యడం `` గురుంచే చర్చ రచ్చ ఎందుకు అని. హిందూ మతం ఈ దేశం లో 80 % మంది ఆచరిస్తున్నారు. అలాగే ఈ గ్రూప్ లో దాదాపు 99 % మంది హిందువులే ఉండవచ్చు.వారికీ మాత్రమే ఈ మతం లో ఉన్న ఆచారాల గురుంచి అవగహన ఉంటుంది. కాబట్టి హిందూ మతం లో ఉన్న మంచి, చెడుల గురుంచి చర్చిస్తున్నారు.ఎవరైనా విమర్శలను ఆహ్వానించ గలిగినపుడే, అభివృద్ధి అనేది అందుకు కో గలరు .విమర్శలను ఆహ్వానిచలేని వారు, వాటిని తప్పించుకునే వారు, విమర్శించే వారిని అనగద్రొక్కినవరు చరిత్రలో బాగుపడిన సందర్బాలు లేవు. అటువంటి వారు నియంతలు గా మారిన వారె అధికం. ``గంగ నదిని పవిత్రం చెయ్యాలంటే, గంగా నదిలో మురికిని తొలగించాలి కానీ, గోదవరి నది ని, మురికి గా చేస్తేనే, మురికిగా చుస్తే నో గంగా నది శుభ్రం కాదు``. మత మార్పిడ్ల పై , కుల మార్పిడుల గురుంచి ప్రస్తావించారు. దాని పై నా అభిప్రాయం చెప్ప దల్చుకున్నాను. ఇవన్ని రాజ్యాంగ పరిధి లో అనుమతించ బడేవి. అలాగే హిందూ మతం లో కుల నిచ్చన ఉంది, దీనివల్ల అవమానాలకు గురైయ్యేవారు, అలాగే ఆలయ ప్రవేశం అనుమతి లేనివారు, అలాగే హిందూ మతం లో ప్రార్ధనలు అన్ని సంస్కృతం లో ఉంటాయి [ సామాన్యంగా అర్ధం కాదు], అలాగే మిగతా మత సంస్తలు చేస్తున్న విద్య, వైద్య సేవల కు, వారి సరళ ప్రార్ధనలకు ఆకర్షితులు ఐన వారు ఈ మత మర్పిడులకు, కుల మార్పిడులకు దోహదం చేస్తున్నారు. వీటి విషయం లో హిందూ మత పెద్దలు కొన్ని సంస్కరణలు తెస్తే బాగుంటుది అని నా అభిప్రాయం. ఇక తీవ్ర వాదం గురించి , తీవ్రవాదం ఏ రూపం లో ఉన్న అది మానవాళి కి అత్యంత ప్రమాదకరం.దానికి కులం, మతం, ప్రాంతం లాంటి ప్రతేకతలు ఏమి ఉండవు. ISIS కూడా దీనికి మినహింపు కాదు. అయితే ఈ తీవ్రవాదం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ తీవ్రవాదం ఇంత సమస్య కావడానికి పరోక్ష, ప్రత్యక్ష పాత్ర అమెరికా ది మాత్రమే. అలాగే ఆర్ధిక తీవ్రవాదం కూడా దీనికి కారణం అని చెప్పవచ్చు. అయోధ్యలో రామాలయం కట్టిస్తే, భారత దేశాన్ని హిందు దేశం గా మారిస్తే ఈ దేశం లో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయా ? అవుతాయి అంటే అందరమూ దానికోసం శ్ర మిద్దాం. ఒక వేళ అదే నిజం అనుకుంటే ఇప్పటికి 80 % మంది హిందువులే ఉన్నారు కదా,. అలాగే, రామాలయం లేని ఉరు, రాముని దేవుని గా కొలవని హిందూ గడప కాగడా పట్టి వెతికినా కనిపించదు.మరి ఇప్పటికి ఇన్ని ఆర్ధిక, సాంఘిక, సామజిక,ప్రాంతీయ, లింగ వివక్షతలు ఎందుకున్నాయి ? ఇవన్ని పాలకులు, పెట్టుబడి దార్లు కలిసి జనాన్ని బ్రమల్లో ఉంచడానికి ఉపోయోగిస్తునారు. కాబట్టి మిగతా మతలను తిడుతూ పోస్ట్లు చేసే మిత్రులారా, మీరు ఈ దేశాన్ని హిందూ దేశం గా మరల చేద్దురు,మన దేశ ``సహజ వనర్లు``, సంపద లు తరలి పోతున్నాయి, మనం, మన పూర్వికులు చేసిన కష్టం `` ప్రభుత్వ రంగ సంస్తలు `` ప్రవటికరించ బడుతున్నై. అందరం కలిసి ఈ ప్రవటికరణ, విదేశీ పెట్టుబడుల గురుంచి పోరాటం చెయ్యకుంటే ,భారత దేశం వలస దేశం గా మారుతుంది. మన తర్వాత తరలు బహుళజాతి సంస్తల కబంద హస్తాల లో నల్గి పోతారు. దయ చేసి మీ పోరాటాలను, మేధస్సును ఈ ఆర్ధిక విధానాల పై ఎక్కు పెట్టండి. కులాల పేరా, మతాల పేరా, ప్రాంతాల పేరా, లింగాల పేరా, వర్ణాల పేరా మరల కొట్టుకుందాం. మన ``భారత మాతే `` ఈ విదేశీ పెట్టుబడుల దరి అనుకూల విధానాలతో పరదీనం అయ్యే ప్రమాదం లో పడింది. పక్క[ మతాల ,కులాల . ప్రాంతాల ,భాషా లను ] వారిని గౌరవిస్తూ .., ఈ కుల, మత , ప్రాంత, లింగ, భాష భేదాలకు వ్యతిరేకంగా ఐకమత్యంగా కలుద్దాం. మన భారత జాతిని కాపాడుకుందాం. దయ చేసి ఆలోచించండి..
Posted on: Tue, 21 Oct 2014 14:56:35 +0000

© 2015