TO తెలుగు షార్ట్ ఫిలిం - TopicsExpress



          

TO తెలుగు షార్ట్ ఫిలిం మేకర్స్ (ఫ్యూచర్ ఫిలిం మేకర్స్) టైటిల్స్ : లవ్ యు అమ్మాయి , అమ్మాయి గిల్లింది , ప్రేమ లో నేను , నేను నా సంతోషి, etc etc కాన్సెప్ట్స్ : కట్ చేస్తే పార్క్ , గిటార్ పట్టుకొని ఓ కుర్రాడు, కుక్కపిల్లని తీస్కోని మార్నింగ్ వాక్ కి వచ్చిన అమ్మాయి .... etc etc తెలుగు సినిమాలు ఎప్పుడు మారతాయి అని చెప్పి గగ్గోలు పెడుతుంటాం , టీ కొట్టు దగ్గర కూర్చుని .. INTERSTELLAR గురించి మాట్లాడుతాం ... తెలుగు సినిమాలను అవహేళన చేస్తాం.. ఎప్పుడు ఇవేనా అంటూ.. మరి మనం ఏమి చేస్తున్నాం .. తెలుగు ప్రేక్షకులు ఇంతే అంటుంటాం .. తమిళ్ సినిమాలను పోగుడుతాం.. అసూయ పడతాం.. వాళ్ళు మనకంటే talented లే అని సర్ది చెప్పెసుకుంటాం ... తెలుగు సినిమా మారాలంటే ... దాని భవిష్యత్తు తరాలు ఇప్పటినుంచే మారాలి.. youtube లో వీడియో పెట్టి మీ కళను exhibit చేస్కోదానికే ఇన్ని కమర్షియల్ calculations మైండ్ లో పెట్టుకొని తీస్తున్నారంటే .. ఇక మీలో రేపు డిరెక్టర్లు అయితే .. ఇవే ఆలోచనలు పెద్ద తెర మీద పెడతారు.. తెలుగు సినిమా వెనుకంజలోనే కొనసాగుతుంది.. తెలుగు ప్రేక్షకులు శివపుత్రుడు, ప్రేమిస్తే లాంటి దుబ్బింగ్ సినిమాలను 100 రోజులు ఎందుకు ఆడించారో తెలుసా?? కొత్తదనం ఉంది కాబట్టి .... ఆ ఫిలిం బై అరవింద్ , ఐతే సినిమాలను 100 రోజులు ఎందుకు ఆడించారు?? అందులో మీరనుకొనే CALCULATIONS ఉన్నాయా ?? తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారు.. సో మీ ఆలోచనలను ఈ పార్కుల వరకే పరిమితం చెయ్యకండి.. నా ఆలోచనలతో మీలో ఆలోచనలను రేకెత్తించదానికే ఈ నా మొదటి మరియు చివరి ప్రయత్నం - పాతబస్తిలో గాలిపటం ఇట్లు బండి సరోజ్ కుమార్ https://youtube/watch?v=D3K7frsli_M
Posted on: Tue, 30 Dec 2014 16:58:27 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015