ఈ సంవత్సరం ఆస్కార్ - TopicsExpress



          

ఈ సంవత్సరం ఆస్కార్ నామినేషన్లు పొందిన వాటిలో 10 ముఖ్యమైన సినిమాలు. అవి her gravity american hustle 12 years a slave nebraska captain phillips the wolf of wall street dallas buyers club philomena frozen పైన చెప్పిన సినిమాల్లో, గ్రావిటీ ఒక్కటే థియేటర్ లో చూసాను. ఇంటర్నెట్ పుణ్యమా అని మిగతావి టొరెంట్ లు డౌన్లోడ్ చేశాను. మొత్తం పది సినిమాలు, దేనికదే సాటి! సినిమా ప్రేమికులు తప్పకుండా చూడవలసిన సినిమాలు. ముందుగా her గురించి చెప్పుకోవాలి. మనిషి ,కాన్షస్నెస్ ఉన్న ఓ కంప్యుటర్ తో ప్రేమలో పడతాడు. భవిష్యత్తులో మన సమాజాలు ఎలా ఉండబోతున్నాయి అనేది బాగా చూపించాడు.ఆల్రెడీ ఇప్పుడే కంప్యుటర్ తో గంటలు,గంటలు గడుపుతుంటే, మెషిన్ తో ప్రేమలో పడటం నాకేమీ ఎబ్బెట్టు గా అనిపించ లేదు. ఫుచురిస్టిక్ వాతావరణం, మానసిక పరిస్థితులు - వండర్ఫుల్ మూవీ. gravity గురించి చెప్పనక్కరలేదు. చాలా మంది చూసే ఉంటారు. నాకు నచ్చిన రెండో సినిమా! sandra bullock కి , స్పెషల్ ఎఫెక్ట్స్ కి అవార్డ్ రావొచ్చు. 12 years a slave లో స్వేచ్చగా ఉండే నల్లవాడు, కిడ్నాప్ కి గురి అయ్యి, పన్నెండు సంవత్సరాలు బానిస గా బతికి బయటపడిన జరిగిన కధని, హృద్యం గా చూపించాడు. లీడింగ్ రోల్స్ కి అవార్డులు రావొచ్చు. nebraska సినిమాలో అమెరికన్ వృద్దాప్య జీవితం బ్యాక్ డ్రాప్ లో సమాజపు, కుటుంబ,మానవ విలువలు బాగా చూపించాడు. ఇందులో ముఖ్య నటుడు డెబ్బయి ఏళ్ల వాడుగా bruce dern బాగా నటించాడు. సోమాలియన్ సముద్రపు దొంగల బారిన పడిన అమెరికన్ కెప్టైన్ ఎలా విడుదల అయ్యింది అనే కధాంశం తో నిర్మితమైన సినిమా,captain phillips. ఓ స్టాక్ బ్రోకర్ ఎదుగుదలను, మార్కెట్ మాయాజాలం, విశృంఖలంత్వంగా చూపిన సినిమా wolf of wall street. de caprio నటన అద్భుతం. ఎనభైల నాటి, విశృంఖలంగా జీవించిన ఓ రోడియో జీవితం లోని నిజ ఘటనలతో తీసిన చిత్రం dallas buyers club . ముఖ్య,సహాయ నటుడి నటన అద్భుతం. ఎయిడ్స్ జీవితాలు, అమెరికా డ్రగ్స్ రేగ్యులేషన్లు, విపరీత మనస్తత్వాలు హృదయ విదారకం గా ఉంటుంది సినిమా. గొప్ప స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ కి ఉదాహరణ గా american hustle చెప్పుకోవచ్చు.అమెరికన్ బ్యాంకింగ్,ఆర్ధిక నేరమయ ప్రపంచము చుట్టూ అల్లిన కధాంశం కొంత గజిబిజిగా ఉంది. పదహారేళ్ళ వయసులో ,తెలిసీ తెలియక జరిగిన ఘటనలో, ఓ పిల్లవాడు పుడితే, అక్కడి చర్చీ వాళ్ళు దాన్ని పెద్ద పాపంగా ఆమెకి చెప్పి కన్న కొడుకుని దూరం చేస్తారు. నలభై ఏళ్ల తరువాత ఆ కన్నతల్లి ,కొడుకుని వేదుకుధామని బయలుదేరుతుంది. అనుకోని నిజాలకు కంగారు పడకుండా, తన గమ్యానికి ఎలా చేరింది? తప్పు తల్లిదా? విడదీసిన చర్చి దా? అనే ప్రశ్నను ప్రేక్షకుడి ముందు తీసుకు వస్తుంది. best animation movie గా frozen చెప్పుకోవచ్చు. థియటర్ లో విడుదల అయ్యింది. పిల్లలు కి నచ్చే సినిమా! అక్కా చెల్లెళ్ళ మధ్య, ప్రేమ ను గొప్పగా చూపిన సినిమా! సరే మన పని అయ్యింది. అవార్డులు ఎవరికిస్తారో 24 దాకా వేచి చూద్దాం.
Posted on: Mon, 17 Feb 2014 02:14:38 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015