// ఉదయ్ కిరణ్ గారి కి - TopicsExpress



          

// ఉదయ్ కిరణ్ గారి కి సుస్వరాల నివాళి // WE MISS U UDAY :D ||ప|| |అతడు| చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమ్మా |ఆమె| చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా మదిలోని బొమ్మ నీ ఎదుట ఉందని తెలుసుకోమ్మా |అతడు| మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే . ||చ|| |అతడు| వయసుకే తెలియదే ఎన్నాళ్లో గడిచిందనీ పరికిణీ బొమ్మకి పైట చుడుతుందనీ |ఆమె| దూరమే చెప్పదే నీ రూపు మారిందనీ స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దైందని |అతడు| ఇక పై మన కౌగిలింతకి చలి చీకటి కంటపడదని |ఆమె| ఎపుడూ మన జంట గడపకి కలతన్నది చేరుకోదనీ…. |అతడు| కొత్తగా తెలుసుకున్నాననీ….. ||చెప్పనా ప్రేమ || . ||చ|| |అతడు| రెక్కలే అలిసినా నీ గుండెలో వాలగా ఎక్కడా ఆగక ఎగిరివచ్చానుగా |ఆమె| పక్కనే ఉండగా కన్నెత్తి నను చూడకా దిక్కులే తిరుగుతూ వెతికావులే వింతగా |అతడు| ప్రాణానికి రూపముందనీ అది నువ్వై ఎదురయిందని |ఆమె| ప్రణయానికి చూపు ఉందని హృదయాన్నదే నడుపుతుందనీ |అతడు| విరహమే తెలుసుకోవాలనీ…. || చెప్పనా ప్రేమ || Song (విరహంతో) Lyrics ||ప|| |అతడు| చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా || చెప్పవే || మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే . ||చ|| |అతడు| ఇప్పుడే నువ్విలా వెళ్లావనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది ||2|| ఎపుడో ఒకనాటి నిన్ననీ వెతికానని ఎవరు నవ్వనీ ఇపుడూ నిను చూపగలననీ ఇదిగో నా నీడ నువ్వనీ నేస్తమా నీకు తెలిసేదెలా |ఆమె| చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా || చెప్పవే || . ||చ|| |ఆమె| ఆశగా ఉన్నదే ఈ రోజే చూడాలని గుండెలో ఊసులే నీకు చెప్పాలని || ఆశగా || నీ తలపులు చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగిన నిను చేరే వరకు ఎక్కడా కైరిగించను కంటి నీరుగా స్నేహమా నీకు తెలిపేదెలా |అతడు| || చెప్పవే || |ఆమె| || చెప్పవే || |అతడు| మనసంతా నువ్వే || 3 || మనసంతా నువ్వే Movie Name : Manasantha Nuvve(మనసంతా నువ్వే)(2001) Cast : Reema Sen, Uday Kiran Singers (దగ్గరున్నప్పుడు) : S.P. Charan, Sujatha Singers (విరహంతో) : R.P. Patnaik, Usha Music Director : R.P. Patnaik Director : V.N. Aditya Producer : M.S. Raju Banner : Sumanth Art Productions Song Lyric : Chepave Prema, Cheleemee Cheeroonama Lyricist(s) : Siri Vennela Sitarama Sastry
Posted on: Tue, 06 Jan 2015 10:50:56 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015