ఏదో ఒకటి అనాలి - TopicsExpress



          

ఏదో ఒకటి అనాలి వార్తల్లో ఉండాలంటే , ప్రతిపక్షం అనిపించుకోవాలంటే , ఏదో ఒకటి అనాలి . ప్రజలు ఎలా స్వీకరిస్తారన్నది వేరే విషయం . విషయానికి వద్దాం . SAARC దేశాలు తెలుసు కదా ! South Asian Association for Regional Cooperation లో ప్రస్తుతం ఉన్న దేశాలు Afghanistan , Bangladesh ,Bhutan ,India ,Maldives,Nepal, Pakistan, Sri Lanka .చుట్టు పక్కల ఉన్న దేశాలతో మనకు సత్సంబంధాలు ఉండాలి కదా ! దాని కోసం సామ , దాన, భేద , దండోపాయాలు అవసరం అవుతాయి కదా ! అసలు ఈ దేశాల మధ్య సమావేశాలు జరిగేది శాంతి , పరస్పర సహకారం ,తద్వారా దేశాల పురోగతియే కదా ! మోది గారి పదవీ ప్రమాణ స్వీకార ఉత్సవానికి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కు ఆహ్వానం పంపారని తెలిసి [ SAARC deshaalannitini pilichaaru koodaa ], జనతా దళ్ యునైటెడ్ J D U పార్టీ నాయకుడు కె సి త్యాగి ఒంటి కాలి పై లేచారు . ఉగ్ర వాదానికి అడ్డుకట్ట వేసే వరకు పాకిస్తాన్ తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోబోమని ఎన్నికల ప్రచారం లో మోదీ చెప్పారని ,ఇప్పుడు మాట తప్పి , ఆహ్వానిస్తున్నారని సెలవిచ్చారు . నాయనా ! అడ్డుకట్ట వేయించడానికే ప్రథమ ప్రయత్నం ఎందుకు కాకూడదు ? వాజపేయి గారు పాకిస్తాన్ వెళ్ళ లేదా ! లాహోర్ బస్సు ప్రయాణం చేయలేదా ! అయినా ఈ ఆహ్వానం మర్యాద పూర్వకం . పిలిచినంత మాత్రాన మోదీ సర్కారు పాకిస్తాన్ కు దాసోహం అవుతుందా !దేశాన్ని రాసి ఇచ్చేస్తుందా ! ఆ మాటకు వస్తే , జె డి యు కన్న బి జె పి కే దేశాభిమానం ఎక్కువ . ఈ నిజం దేశ ప్రజలందరికి తెలుసు .. ఇటువంటి విమర్శలకు జవాబు ఇస్తూ పొతే ... టైం వేస్ట్ ! పైగా పోజ్ కొట్టే అవకాశం ఇచ్చినట్టూనూ !!
Posted on: Wed, 21 May 2014 10:59:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015