ఒక్కన్నే ఆర్ట్స్ కాలేజి - TopicsExpress



          

ఒక్కన్నే ఆర్ట్స్ కాలేజి వద్దకు పోయా అర్దరాత్రి పన్నెండు, పిండార బోసిన వెన్నల్లో సగర్వంగా నిటారుగా ఉంది. తెలంగాణా కేబినేట్ ఆమోదం, కాల్చిన బాణా సంచా, పంచిన మిటాయి తీపి గుర్తులు, గోడల వైపు తీక్షనగా చూసా ఎడమవైపు "R S U" మూడక్షరాలు. ఎనభై వ దశకం లో రాసిన ఎర్రటి జాజు తో రాసిన తెలంగాణా ఆత్మ గౌరవ స్ఫూర్తి.తెలంగాణా కార్యక్షేత్రానికి బీజాలు చల్లిన మూడక్షరాలు ఎంత మందికి తెలుసు ? పదేళ్ళ గులాబీ రంగు నేడు మిడిసి మిడిసి పడుతోంది ఎందుకంటె తెలంగాణా విముక్తి లెక్క 100+12 మార్చినది , దానికేం తెలుసు నాలుగు దశాబ్దాల తండ్లాట, తెగిన తలలు , చిద్రమయిన జీవితాలు ఎంత నెత్తురు ఏరులై పారింది ? .తెలంగాణా జనసభ, TSF, TVV, TPF అంజన్న, సంతోష్, సత్యమూర్తి ,వసంతు, లలిత, ఇలన్న, వనిపెంటవెంకటన్నస్ఫూర్తి ని నడిపిన మూడు అక్షరాలు ,బోజ్య , స్వర్ణ, చారి, యాదయ్య , వేణుగోపాల్, ఎన్ని వేల కొవ్వత్తులు కాలం చెక్కిలి మీద మైనం లా కరిగి పోయినవి కాలం విచిత్రమయింది ఇప్పుడు తెలంగాణా కళ్ళులేని కబోది రాసిన చరిత్ర .అమరులకు వినమ్రంగా జై తెలంగాణా ...
Posted on: Thu, 03 Oct 2013 18:54:02 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015