టి కాంగ్రెస్ నేతల్లో - TopicsExpress



          

టి కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైంది. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని చిత్తు చిత్తుగా ఓడిస్తామంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు.. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా ప్రకటించడంతో టీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇదే జరిగితే ఏం చేయాలన్న అంశంపై వారు మంగళవారం సీఎల్పీలో సమావేశం కావాలని నిర్ణయించారు. టి కాంగ్రెస్ నేతలు ఎందుకు కలవరపడుతున్నట్లు? కాంగ్రెస్ పార్టీ విప్ ఎందుకు జారీ చేయదు? విప్ జారీ జేసినాక కూడా సి డబ్ల్యూ సి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు.. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా ధిక్కరిస్తారు ? కాంగ్రెస్ పార్టీకి మొదట చిత్తశుద్ధి వుంటే ఎలాంటి ఆందోళన కు తావుండదు. ----------------------- మరోవైపు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో జాప్యం చోటు చేసుకోవడంతో పాటు సీమాంధ్రలో ఉద్యమం మరింత ఉవ్వెత్తున సాగుతుండటం వారిని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. లోలోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు. సి డబ్ల్యూ సి నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే కిరణ్, పోలీస్ బాసులు తెలంగాణా లో అమలు జేసిన చట్టాన్ని అమలు జేస్తే సీమాంధ్రలో జరిగే ఈ లొల్లికి అవకాశమే వుండేది కాదు. వివక్ష పాలనలో ఎందుకు కొనసాగాలి? సి ఎం కిరణ్ ను ఎందుకు వెలివేయోద్దు? సహాయ నిరాకరణ ప్రకటించండి. సి ఎం భర్తరఫ్ ను డిమాండు చేయండి. సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలను పార్టీ దిక్కరణ నేరం పై ముందస్తుగా ఎందుకు చర్య తీసుకోరు? ----------------------- ప్రధానంగా అసెంబ్లీకి తెలంగాణ తీర్మానం వస్తే ఓడించాలంటూ ఏకంగా ముఖ్యమంత్రి కిరణే... సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు సూచిస్తుండంటం టీ కాంగ్రెస్‌ను కలవరపరుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో ఏపీఎన్‌జీఓల సభ నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం, సీఎం కిరణ్‌ వ్యవహరించిన తీరు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించుకుని భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో సమావేశమవుతున్నారు. చట్టపరంగా అసెంబ్లీ తీర్మానం అవసరమా? కేంద్ర ప్రభుత్వం తీర్మానించుకున్నాక, బిల్లు ఆమోదిస్తే సరి పోదా? కాంగ్రెస్ తలుచుంటే అవసరమైతే, అసెంబ్లీని రద్దు జేసి రాష్ట్రపతి పాలన తెచ్చి తెలంగాణా చేసే అవకాశం లేదా? Jai Telangana! Jai Jai Telangana! From: S N Reddy Katanguru TRTU Founder President
Posted on: Tue, 10 Sep 2013 08:33:54 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015