తొమ్మిది రోజులుగా - TopicsExpress



          

తొమ్మిది రోజులుగా సచివాలయం మొహమే చూడని వాయల్పాడు ముఖ్యమంత్రి కిరణ్.. ఇపుడే లేచి అధర్మమధర్మమని ఆవులించుచున్నాడు. మంత్రులు సరేసరి. వందలాది ఫైళ్లు పెండింగ్‌లో పడిపోయాయి. గోదావరి వరద బాధితులను పట్టించుకున్న నాథుడే లేడు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఇప్పుడా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. పంచాయతీ ఎన్నికలకు ముందు అన్ని రంగాల్లో 54 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం దీనిపైనా నిర్ణయం తీసుకోవడం లేదు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా 20,508 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఏపీపీఎస్సీ ద్వారా 12 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వివిధ రంగాల్లో మరో 22,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.625 కోట్లు అవసరమని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. శాఖకు మంత్రి లేకపోవడం, పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో.. ఒక్కపైసా కూడా నిధులు అందలేదు. ప్రజాసంక్షేమం వదిలేసి నీచ రాజకీయాలు చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర లేదా సీమాంధ్ర ఏదైనా మాట్లాడొచ్చు. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఒక పౌరుడిగా మాత్రమే, ముఖ్యమంత్రిగా కాదు. ముందు పదవికి రాజీనామా చేసి వీధుల్లోకి వెళ్లి ఉద్యమించాలి. లేదా తెలుగు ప్రజల ముఖ్యమంత్రిగా హుందాగా ప్రవర్తించాలి. యిచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు చంద్రబాబు. పార్టీ నాయకులు కూడా ఎక్కడా సంయమనం కోల్పోవడం లేదు. ప్రతిపక్ష నాయకుడిని చూసి అందరూ బుద్ది తెచ్చుకోండి. ఆయన అసలు సిసలు రాజనీతిజ్ఞుడు!
Posted on: Fri, 09 Aug 2013 13:16:57 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015