దేశాభిమానము నాకు కద్దని - TopicsExpress



          

దేశాభిమానము నాకు కద్దని _ వట్టి గొప్పలు చెప్పుకోకోయ్ ! పూని ఏదైనా ఒక మేల్ చేసి జనులకు చూపవోయ్......!! మన పూర్వీకులు అనేక కష్ట నష్టములకు ఓర్చు కొని తమ ప్రాణాలను సైతము తృణ ప్రాయముగా భావించి మనకు స్వాతంత్రము సాధించి పెట్టేరు. అట్టి స్వాతంత్రమును పదిలంగా కాపాడు కొనుట మన కనీస భాద్యత. సభలు పెట్టుకొని,సంబరాలు చేసుకొంటూ కాలము వెళ్ళబెట్ట వద్దు. మన దేశ చరిత్రలో ఇప్పుడు మరొక స్వర్ణ యుగం మొదలైంది. ఒక భారతీయునిగా మన దేశ అభివృద్ధి లో భాగస్వాములమవుదాం. శ్రమ పడి మన దేశాన్ని అభివృద్ధి పథము వైపు నడిపించుదాం. దేశానికి సేవ చేయటము అంటే దేశము అంతా తిరగవలసిన అవసరము లేదు. మన బడి, గుడి, మన వీధి, మన పరిసరాలు , మనం బాగు చేసు కొంటే చాలు. మంచి పనులు చేయుటకు, నిధులు లేవనే సాకును ప్రక్కన పెడదాము. మన విధులను సక్రమంగా గా పాటించి మన తోటి వారికి మార్గదర్శకుల మౌదాము. మనలో ఒక చిన్న మార్పుతో , సాధించవచ్చును దేశ సౌభాగ్యమును. మనలో ప్రతి ఒక్కరము సాధించవచ్చును, అద్భుతములు ... ఒకే ఒక్క మంచి మాటతో.....ఖర్చులు లేని ఒక మంచి పనితో..! Never give money to street beggars. Plz take care to offer them food n shelter. Never forget that false beggars are destroying our Nations name n fame. Discourage wastage of food at functions and at our Dining-Tables. Thus saved amount can be utilized as carpus fund , to help our poor Farmers who are struggling to produce food for us. And to feed the food to the under privileged people around us. నాయకులు, అధికారులు తమ తమ విధులను సక్రమంగా నిర్వహించే విధముగా ప్రజా విజిలెన్సు పెంచుదాము. శ్రమదానం ప్రోత్సహించుదాం.
Posted on: Sun, 07 Sep 2014 11:49:43 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015