పేగు బంధం ఎటు - TopicsExpress



          

పేగు బంధం ఎటు పోతోంది? -------------------------------------- *నిన్న సాయంత్రం సుబ్బమ్మ అనే 64 సం,,ల వృద్ధురాలు స్నేహ హస్తం ఆఫీసుకు వచ్చి , ఏడుస్తూ చెప్పిన విషయాలివి. *ఆమె ఇద్దరు కొడుకులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నారు. కానీ కన్నతల్లి ఆరోగ్యం గురించి ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు. *ఆమె కంటి చూపు లేక ఇబ్బంది పడుతూ,కంటికి ఆపరేషన్ చేయించమని అడిగితే,ఇద్దరు కొడుకులూ ఒకరి మీద ఒకరు ఆ భాద్యతను నెట్టివేస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్నారు. *ఇక చేసేది లేక, ఆమె మా స్నేహహస్తాన్ని ఆశ్రయించి, చూపు లేదని కంటికి ఆపరేషన్ చేయించమని వేడుకుంది. *పది మందికీ విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులుగా ఉంటూ,కన్నతల్లికి కంటి ఆపరేషన్ చేయించలేని కొడుకులను ఏమనాలి మనం..... ఎటు పోతోంది మన సమాజం...... ____________________________________________________ ఇటువంటి సంఘటనలు తెగిపోతున్న పేగు బంధాలకు ప్రత్యక్ష ఉదాహరణలు.
Posted on: Wed, 03 Jul 2013 06:38:44 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015