వాడు: గాంధీ నాకు - TopicsExpress



          

వాడు: గాంధీ నాకు నచ్చడు.!! నేను: ఎందుకు? వాడు: ఏమో నాకు నచ్చడంతే. నేను: కారణమేదో ఉంటుంది కదా. వాడు: నాకు శుభాష్ చంద్ర బోస్ అంటే ఇష్టం. నేను: ఆయన నాక్కూడా ఇష్టమే. దానికీ దీనికీ ఏంటి సంబంధం? వాడు: గాంధీ చాలా పాలిటిక్స్ నడిపాడు. నేను: అంటే? వాడు: శుభాష్ చంద్ర బోస్ లాంటివాళ్ళని కాంగ్రెస్ పార్టీలో తొక్కేశాడు, హింస అనే పేరుతో. నేను: వాళ్ళని తొక్కెయ్యడం కాదు. గాంధీ అహింసావాది. వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని వ్యతిరేకించాడు. వాడు: అంటే? శుభాష్ చంద్ర బోస్ చేసిందంతా తప్పంటావా? నేను: ఆయన చిత్తశుద్ధిని, ఆయన త్యాగాన్నీ నేను కాదనను.. కానీ హిట్లర్ తో కలవాలన్న అలోచన తప్పు. వాడు: OK.. అది వదిలెయ్యి.. మరి ఆయన ఎలా చనిపోయాడు? నేను: Air crash లో వాడు: అదే ఎవరు చేయించారు ఆ crash? నేను: ఎవరు??? వాడు: గాంధీ, నెహ్రూ కలిసి చేయించారు..!! నేను: Are you seriously making that blame..? వాడు: హా..!! నేను: Proof ఏంటి?? వాదు: Proof ఏంటి??? నేను: ఆ మాట ఎలా అనగలవు? Proof ఉండాలి కదా ! మా ఎదురింటి అన్నయ్య చెప్పాడూ, మా స్కూల్ ఫ్రెండ్ చెప్పాడూ అనకు.. వాడు: ఏదో పుస్తకంలో చదివాను. నేను: ఏం పుస్తకం? వాడు: ఏమో గుర్తులేదు. But I hate Gandhi.!! నేను: మూర్ఖులతో మాట్లాడలేము..! వాడు: అవును. మూర్ఖులతో మాట్లాడలేము..!!
Posted on: Wed, 02 Oct 2013 06:43:47 +0000

Recently Viewed Topics




© 2015