On Cosmologies – New Series – - TopicsExpress



          

On Cosmologies – New Series – 5 విజ్ఞానయుగానికి సాయంసంధ్య ఈ రోజు నాకు చేరిన కరెంట్ సైన్స్ చదువుతుంటే ఒక పుస్తక సమీక్ష నాదృష్టిని ఆకర్షించింది. ఆ పుస్తకం శీర్షిక The Twilight of the Scientific Age ఆ పుస్తకం వ్రాసినది Martín López Corredoira బ్రౌన్ వాకర్ ప్రెస్, బోకారేటన్, ఫ్లారిడా, 2013. ఇవన్నీ అర్థసత్యాలు, రచయిత స్వంత అభిప్రాయాలు, విజ్ఞాన వేత్తలు చదవక్కరలేనిది. మానవుని అస్తిత్వం భూమిపై ఉన్నంతకాలము విజ్ఞాన శాస్త్ర పరిశోధన, విశ్వములోని నూతన సత్యాల ఆవిష్కరణ జరుగుతూనే ఉంటుంది. ఇది మన భారతీయ వైజ్ఞానికుని సమీక్ష. నాకు ఈయన సమీక్షపై నమ్మకము కుదరలేదు. ఎవరీ రచయిత? 2013లో ఈ పుస్తకం వ్రాయడానికి ఈయన అర్హత యేమిటి? అని చూచాను. ఈయన భౌతిక శాస్త్రములోను, తత్త్వ శాస్త్రంలోనూ Ph.D. ఉన్న 43 సంవత్సరాల వైజ్ఞానికుడు. స్పెయిన్ లో ఖగోళ భౌతిక శాస్త్ర పరిశోధన శాలలో వైజ్ఞానికుడు. Instituto de Astrofísica de Canarias (Tenerife, Spain) ఈయన పుస్తకం మీద ఇతరుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఈయన ఇంకో పుస్తకం కూడా వ్రాశారు. Un debate sobre cosmología, ciencia y religión (Áltera, Barcelona, 2008) స్పానిష్ భాష తేలికగా అర్థం అవుతున్నది, A Debate on Sober Cosmology, Science and Religion. సుమారుగా మనం చర్చించుకుంటున్న విషయాలే. ఈయన పరిశోధనా విషయము మిల్కీవే గెలాక్సీ నిర్మాణ క్రమం. అందులో నక్షత్ర సమూహాలలో నక్షత్రాల సంఖ్యను ఎలా లెక్కించాలి? అనే కార్యక్రమంలో ఆయన పనిచేస్తున్నారు. ఇదే పుస్తకానికి ఒక అమెరికన్ సమీక్ష ఇలా ఉన్నది - The Twilight of the Scientific Age presents an excellent overview of society and its workings, in particular of the corruption that pervades current science. It is a book that deserves to be read and reread. - Paul LaViolette, Ph.D. ఇప్పుడు సామాన్య పాఠకులకు ఒక సందేహం వస్తుంది. ఎవరి సమీక్షను నమ్మాలి? సమీక్షకులు ఇద్దరూ విజ్ఞాన శాస్త్రములో పనిచేస్తున్నవారే. నిజానికి ఇది ఆ పుస్తకం చదవడానికి కొంత కుతూహలాన్ని కలిపిస్తుంది కూడా. ఇదే సందేహాలు మతం విషయంలోనూ వస్తాయి. ఏ మతాన్నీ కేవలము ఆ మత గ్రంధములోని కొన్ని సత్యవాక్యాలను బట్టి మూల్యాంకనం చేయలేము. గ్రంధాలు ఏమి చెబుతున్నాయి కంటె ఆ మతాన్ని అవలంబించే సమాజము నేడు ఎలా పనిచేస్తూంది అన్నది ముఖ్యం. ఉదాహరణకి ఊర్ధ్వలోకాలను గురించి చెప్పుకుందాము. పేర్లు ఏమైనా ఆస్తిక మతాలన్నీ మరణానంతర గతిని గురించి మాట్లాడతాయి. (ఇస్లాములో స్వర్గం) - 140 నుండి 180 కోట్ల జనాభాతో క్రైస్తవం తరువాత ప్రపంచంలో ఇస్లాం మతం రెండవ అతి పెద్ద మతం. ప్రళయాంతము అనేది ఉన్నది.ఒకానొక రోజు సర్వసృష్టీ అంతమగును. ఆ రోజునే ఇస్లాం లో ఖయామత్ అంటారు సృష్టి యొక్క ఆఖరి రోజు. ఆరోజున ప్రతి ముస్లిం మరియు ముస్లిమేతరులు తమ తమ కర్మానుసారం అల్లాహ్ చే తీర్పు చెప్పబడెదరు.ముహమ్మద్ ప్రవక్త ఆచరణలను సున్నహ్ అనీ ఉపదేశాలను హదీసులు అనీ వ్యవహరిస్తారు.ముస్లింలు ఖురాన్, షరియా, మరియు హదీసుల ప్రకారం నడుచుకుంటూ, అల్లాహ్ కు తమవిధేయతను ప్రకటించి, సన్మార్గంలో నడచినప్పుడే మోక్షము కలుగుతుంది. ఈ మోక్షాన్నే ముస్లింలు మగ్ ఫిరత్ అంటారు. ఈ మగ్ ఫిరత్ పొందినవారే స్వర్గం (జన్నత్) లో ప్రవేశిస్తారు. (వికిపీడియా) దీని అర్థం ఇస్లామును నమ్మని వారికి ఇక్కడ ప్రవేశంలేదు. అవిశ్వాసులను కాఫిర్ (తిరస్కారులు) అని అంటారు. ఇస్లాం ధర్మం ద్వారానే స్వర్గాన్ని చేరగలము. వేరే దారి లేదు. ఇది సత్యం సత్యం. --- ఇది ముఖ్య బోధ.. స్వర్గ సుఖాల గురించి ఖురాను వాక్యాలు - దేవుని భక్తితో ఉండేవారు ఆనందంగా గడపటానికి ఉద్యానవనాలూ, ద్రాక్షతోటలూ, అమ్మాయిలు ఉంటారు. సుఖాశీనులై, తోటల్లో ఫలాలు అందుబాటులో ఉండగా స్త్రీలు ముత్యాలవలె ప్రకాశిస్తుంటారు. తెలుగు సినిమాల్లో మన ఇంద్రసభ కూడా ఇలానే ఉంటుంది. క్రైస్తవులకు కూడా స్వర్గం, నరకం, ఉంటాయి. కాని ఒకొక చర్చి వారి స్వర్గ వర్ణన కొంచెం భిన్నంగా ఉంటుంది. మన శైవం, వైష్ణవంలా ఎవరి విశ్వాసాలు వారివే. క్రైస్తవులకు, మహమ్మదీయులకు కూడా స్వర్గ నరకాలు శాశ్వతం. ఎవరి స్వర్గంలో స్థానం (వారి) దేవుని నమ్మిన వారికే ఉంటుంది. ఏమతమైనా మనుష్యునికి సహజమైన దుఃఖాన్ని దూరంచేసి ఆనందాన్ని సమకూర్చే ప్రయత్నం చేస్తుంది. జీవించి ఉండగా దుఃఖ నివారణ, సన్మార్గంలో ఉంటే మరణానంతరము స్వర్గ సుఖాల వాగ్దానం. హిందూ మతంలో మరణానంతర ఆనందాల చర్చ ఉన్నదా? తైత్తిరీయ ఉపనిషత్తులో ప్రత్యేకం ఒక ఖండమే ఉన్నది. అది ఆనందవల్లి (బ్రహ్మవల్లి లేదా బ్రహ్మానందవల్లి). దీనిని విడిగా పరిశీలించుదాం. ఇప్పుడు మళ్ళీ సైన్స్ విషయానికి వద్దాము. మన అకాడెమీ జర్నల్ లో ఈ పుస్తకం విజ్ఞాన వేత్తలు చదవదగినది కాదు అన్న వాక్యం ఒక మత గ్రంధంలోని విధి నిషేధాలను సూచించే వాక్యం కనీపిస్తుంది. సైన్స్ ఒక కట్టుబాట్లు ఉన్న మతం వలెనే సైన్స్ వ్యవస్థ అధీనంలో పనిచేస్తుంది. సైన్స్ సమాజంకూడా సైన్స్ పాలకుల విశ్వాసాలమీడ ఆధారపడి పనిచేస్తుంది. కొన్ని విషయాలకే ప్రాజెక్ట్ గ్రాంటులు లభిస్తాయి. ఒక కొత్త మార్గాన్ని అన్వేషించే ప్రయత్నానికి, ఆలోచనకు ప్రోత్సాహం లభించడం కష్టం. సైన్స్ వ్యవస్థకూడా ఒక తేనెపట్టు వంటిది. ఒక రాణి ఈగ, వేలాది సామాన్య తేనెటిగలూ ఉన్నట్లే నూతన విషయం కనుగొనే ఆనందం ఒకరికి ఉంటే, దానికి సంబంధించిన విషయసేకరణకు ఉపయోగపడే సాధారణ ప్రయోగాలు చేసే సైన్స్ కార్మికులు scientific workers అనేకులు.
Posted on: Sat, 02 Nov 2013 01:43:54 +0000

Trending Topics




© 2015