ఎప్పటికీ మాయని మచ్చ - TopicsExpress



          

ఎప్పటికీ మాయని మచ్చ ...పాతేస్తే మన్నూ, కాల్చేస్తే బూడిదా అనేమాటనిజమేకాని ప్రాణం పోయిన మనిషి పట్ల ఇంతహేయమైన ప్రవర్తన దుఃఖం కలిగిస్తూంది. ఇలాంటి దారుణాలు సమాజపు నాగరీకతకీ, మనిషి సంస్కారానికీ మాయని మచ్చలుగానే వుండిపొతాయి. ఈతచాపలో చుట్టినా కావడిలో మోసుకెళ్ళినా ఆశరీరం జీవించడం ఆగదు స్మరణ వినిపిస్తున్నంతవరకూ సమాధిలో కదులుతూనే వుంటుంది .మరణించిన మనిషిచుట్టూ అయినవారు గుమిగూడి నిలబడి దాటలేని సరిహద్దు వద్ద సాగనంపుతారు...నిర్జీవ శరీరానికి కూడా నెప్పితెలియకూడదన్నట్టు సున్నితంగా భూగృహంలోనో అగ్నిశయ్యమీదో విశ్రమింపజేస్తారు...మృత్యువులోకి మనిషి గౌరవంగా సాగనంపాలన్న సంస్కారమే మానవీయ విలువల్లో ఉతృ్కష్టమైనది...అనాధమరణమైనా అంతిమసంస్కారం చేయడాన్ని మహాపుణ్యమన్నది ఇందుకే... మరణాన్ని దగ్గరగా చూడటమంటే దీపనిర్వాణగంధాన్ని పీల్చడమే...కలలు కాలిన కమురు వాసనే...కలలు వెలిగించిన చమురువాసనే...మగ్గిపోయిన పండువాసనే..అంతటి ప్రాణదీపాన్ని ఏకారణంచేతైనా బలవంతంగా ఆర్పివేయడం నికృష్టం... మనిషికాయాన్ని కాలితో తన్నడం అంతకుమించిన నికృష్టమేకాక పశుప్రాయం కూడా...అనాధమృతదేహాలకీ, ఎన్ కౌంటర్లలో చనిపోయినవారి మృతదేహాలకీ - చచ్చిపోయిన పశువుల్ని ఈడ్చేయడానికీ పెద్దతేడా వుండదు. ఇది ఉత్తరప్రదేశ్ లో ఒక అమానుష దృశ్యం సంక్షేమకార్యక్రమాలకి వేలు లక్షల కోట్లరూపాయలు ఖర్చుచేస్తున్నప్రభుత్వాలు మనిషి అంతిమ సంస్కారం కాస్త మర్యాదగా కాస్త గౌరవంగా పూర్తయ్యే ఏర్పాట్లు చేస్తే బాగుండును!
Posted on: Mon, 14 Jul 2014 16:39:48 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015