ఎవరినీ అతిగా - TopicsExpress



          

ఎవరినీ అతిగా ప్రేమించకండి. అతిగా ప్రేమించడం వలన మానసిక రుగ్మతలే కాకుండా, శారీరక రుగ్మతలు, బాధలు కూడా అనుభవించాలి. అతిగా తన కొడుకుని ఇష్టపడి పచ్చితాగుబోతు చేసింది. చుట్టు పక్కలవారు, ఇంట్లో వారు, చుట్టాలు చెప్పిన కొడుకు మీద ఉన్న వ్యామోహంతో తాగి వచ్చినా భరించింది, భండభూతులు తిట్టినా పడింది. ఇంట్లోనే వాంతులు, విరోచనాలు కూడా మొన్న మొన్నటి వరకు ఓపికతో చేసింది. చివరికి తన సోదరుడుతో కూడా నిత్యం గొడవలు పెట్టుకుంటున్నా మాట పడనివ్వకుండా కాపాడుకుంటుంది. ఎందుకింత ప్రేమ. ప్రేమతో జీవితాలని బాగుచేయాలి కాని చేడగోట్టకూడదు. ఒక అమ్మాయిని/అబ్బాయిని ప్రేమిస్తే ఎప్పుడు ఏమౌతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఈరోజు. వీరికోసం వారు, వారికోసం వీరు కొందరు ఎదురుచూపు చూస్తుంటే, ఇంకొందరు దక్కరేమో అనే ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాని ఉపయోగం ఏముంది? ఏమిలేదు! ఏదైనా, ఎవరైనా ఇష్టపడోచ్చు తప్పులేదు. కాని అదే లోకం, అదే జీవితం కాదు. ఒకడు ఒక పనిని మొదలు పెట్టి అదే లోకం అనుకుంటాడు. ఇంకొకరు ఒక అమ్మాయి/అబ్బాయిని ప్రేమించి వాళ్ళే లోకం అనుకుని బ్రతుకుతారు. పనో, లేదా అమ్మాయో లోకం అని ఎందుకనుకుంటున్నారు? మీకు తెలుసా? ఒకవేళ అలా తెలిసేట్లయితే అన్ని విషయాలు తెలియాలి కదా! మిగిలిన విషయాలు ఎందుకు తెలుసుకోవడంలేదు. చాలామంది అంటుంటారు. ఈపని చేస్తే నేను జీవితంలో స్థిరపడిపోతాను అని. ఎన్నో ఆశలు పెంచుకుంటారు. అది విఫలం అవ్వగానే కృంగిపోతారు. జీవితంలో పని అయినా ఇంకా ఏదైనా కావచ్చు. మీవంతు కృషి మాత్రమే చేయండి. జీవితం మనచేతుల్లో లేదు అనే విషయాన్నీ గుర్తుంచుకోండి. నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించాను. కాని ఒప్పుకోలేదు. చాలా బాధపడ్డాను. ఇంతవరకు రాలేదు. వస్తుందో రాదో కూడా తెలీదు. అలాగని జీవితం ఆగదు కదా! నా స్నేహితుడు అనుకోకుండా ప్రమాదంలో మరణించాడు. మా ఇద్దరినీ జంటకవులు అనేవారు. ఎంతో బాధ పడ్డాను. తిరిగిరాలేదు. నా చిన్నప్పుడే ఊహ సరిగా తెలియని రోజుల్లో నాన్న వెళ్ళిపోయాడు. నేను రోజు మానాన్న పనిచేసే చోటకి వెళ్లి నాన్న వచ్చాడా? అని అడిగేవాడిని. రాలేదు. ఏడ్చాను. ఫలితంలేదు. ఇంకా ఎన్నో సంఘటనలు నా జీవితంలో జరిగాయి. కాని దేనికి సమాధానం లేదు. ఎంత బాధపడినా మన జీవితం ఆ బ్రహ్మ రాసిన విధంగా జరుగుతుందే కాని మనం అనుకున్నట్టు పొరబాటున కూడా జరగదు. ఇది అక్షరసత్యం. నీకు ఇలా జరిగిందని అందరికి ఇలా జరుగుతుందా అని మీరు అడగొచ్చు. ఎవ్వరి నైన కదిలించి చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ సంఘటనలు కచ్చితంగా ఉంటాయి. ఇదే సృష్టి. అందుకే మనిషిగా జన్మించిన తరువాత మనం ఎక్కడినుండి వచ్చాం? ఎక్కడికి వెళ్తాం? ఏమి చేయాలి? తెలుసుకోవాలి. లేదంటే ఇలాంటి ఎన్నో సంఘటనల సమాహారమైన అంతులేని సంసారసాగరంలో చిక్కుకుని చావలేక బ్రతకలేక చస్తూ బ్రతకాల్సిందే. అందుకే ఎవరిని అతిగా ఇష్టపడకండి. అతిగా ప్రేమిచకండి.. Source:Indian Culture. #CHINNA Like ✔ Share ✔ our Greater Karimnagar Website: greaterkarimnagar/ Page: https://facebook/greaterkarimnagar (Karimnagar No.1 FaceBook Page) Group: facebook/groups/greaterkarimnagar Stay tuned with us for Karimnagar Information and updates. #GREATERKARIMNAGAR #KARIMNAGAR #TELANGANA #INDIA #JAIHIND Regards Greater Karimnagar Team
Posted on: Tue, 21 Jan 2014 07:00:23 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015