ఏమి జీవితం రా ….. కాలేజి - TopicsExpress



          

ఏమి జీవితం రా ….. కాలేజి లో ఉన్నన్నాళ్ళు చదువులు ఎప్పుడు అయిపోతాయ్ , exams నుంచి విముక్తి ఎప్పుడు వస్తుంది , job లో డబ్బులు ఎప్పుడు సంపాదిస్తాం అని తొందర పడతాం . తిప్పలు పడి కనపడిన ప్రతి company interview attend అయి , ఏదోలా job సంపాదిస్తాం . Job join. First month - no work.only enjoy - All Happies Second month - work + enjoy – OK Third month - only work. no enjoy - problem starts అప్పటికి office politics తెలుస్తాయ్ . పక్క team లో manager మంచోడు అయుంటాడు . పక్క team లో అమ్మాయిలు బావుంటారు . పక్క team లో hikes బాగా ఇస్తారు . పక్క team లో work అసలే ఉండదు . మనకి మాత్రం రోజు festival. చేసిన పనికి ... చెయ్యని పనికి దొబ్బించుకోవటమే . ఒక్కో client ఏమో పిచ్చి నా .. requirements ఇస్తాడు . అవి పని చెయ్యవు అని తెలిసి కూడా అలానే చెయ్యాలి . అర్ధ రాత్రి support లు . on-site వాడిని బూతులు తిట్టి పారిపోదాం అనిపిస్తుంది . కానీ office లో net connection free and coffee free అనే ఒక్క ఆలోచన ఆపేస్తుంది . మనకి ఒక batch తయారవుతుంది. ప్రతి రోజు TL, PM ని తిట్టుకుంటూ ఒక ఆరు నెలలు గడిపేస్తాం.ఇలా loop లో పెట్టి కొడితే రెండు ఏళ్ళు అయిపోతాయ్ . అప్పటికి కళ్ళ చుట్టూ black circles, వేళ్ళు వంకర్లు , మెడ నొప్పులు ... పిచ్చ నా .. జబ్బులు అన్ని వచ్చేసి ఉంటాయ్ . సొంత అమ్మ , నాన్న , అక్క , చెల్లి , అన్న , తమ్ముడి నే చుట్టం చూపుగా చూడటానికి వెళ్తుంటాం . ఒక వేళ bro/sis ఉంటే , వాళ్ళే .. s/w field లో ఉంటే .. అర్ధం చేసుకొని తిట్టటం మానేస్తారు . అలా లేకపోతే phone చేసిన ప్రతిసారి సంజాయిషీ . salary పడుతూ ఉంటుంది . bonds కి అని , mutual funds కి అని , credit card bills కి అని కట్టి కట్టి .. సంపాదించింది అంతా ధార పోస్తాం . ఇంకేమన్నా మిగిలితే తెలివైనోడు అయితే home loan మీద , మనలాంటి వాడు అయితే గాలి తిరుగుడు మీద తగలేసేస్తాం. ఇలా జీవితం ప్రశాంతంగా సాగుతూ .. ఉండగా one fine day ఎవడో ఒక ex-colleague / colleague పెళ్లి settle అయింది అని పిలుస్తాడు . మనకి ఒక అమ్మాయ్ ఉంటే బావుండు అనే ఒక వెర్రి ఆలోచన పుడుతుంది . మన s/w field లో బావున్న అమ్మాయిలు అంతా booked, married or north Indians అయి ఉంటారు . అక్కడే వంద లో 95 మంది filter అయిపోతారు . మిగతా ఐదు లో 4 మందిని friend కంటే అక్కా.. అని పిలవటం better అనేటట్టు ఉంటారు . ఆ మిగిలిన ఒక్క అమ్మాయ్ కోసం team అంతా కొట్టేసుకుంటూ ఉంటాం . ఆ అమ్మాయ్ ఎవరితోనూ commit అవ్వకుండానే అందరితో free గా బతికేస్తూ .. ఉంటుంది One more fine day పెళ్లి card ఇస్తుంది . ఇంకేముంది Heart breaking లా దేవదాస్ లా గడ్డం పెంచేసుకొని .. ఆ అమ్మాయి మంచిది కాదు అని deciding. next day నుంచి ఇంకొకళ్ళకి trying. Reviews వస్తాయ్ . నువ్వు excellent, నువ్వే లేనిదే company లేదు, కత్తి , కేక , కమాల్ , etc, etc ... అని చెప్పి ఊరించి చివర్లో.. but అంటారు . తీరా చూస్తే నీ salary లో ఇంకో సనక్కాయ్ పెంచాం , పో .. అంటారు . Resume update చెయ్యాలి అని గత ఆరు నెలలు గా తీస్కుంటున్న decision ని మళ్ళా ఒకసారి స్మరించుకుని.. అలా ఇచ్చిన సనక్కాయల మీద బతికేస్తుంటాం . … ఛీ .. ఎదవ జీవితం !!
Posted on: Fri, 23 Jan 2015 06:29:39 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015