ప్రేయర్ టిప్ (Prayer tip) డియర్ - TopicsExpress



          

ప్రేయర్ టిప్ (Prayer tip) డియర్ ప్రేయర్ పార్టనర్ సామాన్యముగా మనము ఒకొక్కరి ఎదుట ఒకో రకముగా ప్రవర్తిస్తుంటాము. చిన్నతనము నుండి కూడా ఇది మనకు ఎవ్వరూ చెప్పకుండానే నేర్చుకున్న అలవాటు. తల్లిదండ్రుల యెదుట, టీచర్స్ ఎదుట, స్నేహితులు దగ్గర, ఇలా మన ప్రవర్తన మారుతూ వుంటుంది కదా. మనకు తెలియకుండానే ఇలా జరుగుతుంది కొన్నిసార్లు మనము తెచ్చిపెట్టుకుని కావాలని వినయ విధేయతలు ప్రదర్శిస్తుంటాము. ఇది మన నైజము. దీనివల్ల ఈ లోకములో తెలివైన (smart) వారమని జనము మనలను పొగిడినా మన నిజ నైజాన్ని మాత్రము మన వెనుక విస్లెశిస్తారు (criticize) చేస్తుంటారు. హేళన చేస్తుంటారు. ఇది ప్రతివక్కరి జీవితములో జరిగేదే జరుగుచున్నదే. అయితే క్రైస్తవ జీవన శైలి దీనికి భిన్నమైనది. ప్రతివక్కరు మనలాగా మనము క్రీస్తుకు లాగా జీవించ వలసినదే దీనికి వ్యక్తి, స్తలము, సమయము అనే విషయాలు ఏమి మినహాయింపు కాదు. సర్వకాల సర్వావస్తలయందు కూడా ఆయన ఎదుట యదార్ధముగా వుండవలసినదే. పౌలు మహా సభవారిని తేరిచూచిసహోదరులారా, నేను నేటివరకు కేవలము మంచి మనస్సాక్షిగల వాడనై దేవునియెదుట నడుచుకొనుచుంటినని చెప్పెను. And Paul, earnestly beholding the council, said, Men andbrethren, I have lived in all good conscience before God until this day. అపోస్తులుల కార్యములు 23. 1 Acts మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆయనకు మరుగైనది ఈ విశ్వములో ఏది లేదు. మనమేదో ఈ లోకములో దొరికే మంచివాళ్లమనే పేరు కోసమో, కొంచెము మర్యాదకోసమో, ఘనత కోసమో తాపత్రయపడి మనస్సాక్షిని చంపుకుంటున్నామా, మనస్సాక్షి గద్దింపును పెడచెవిని పెడుతున్నామా, మనము వాక్యాన్ని శ్రద్ధగా వినుట వలన, చదువుట వలన, మనము మంచి మనస్సాక్షిని కలిగియుంటాము. తద్వారా మనము సరియైన మార్గాన్నినిర్ధేశించబడతాము. ఒకసారి మన ప్రవర్తన విషయము పునర్విమర్శ చేసికుందాము. ఎటువంటి వేషధారణ స్తితి మనము కలిగియుండకుండా, ఎటువంటి కష్టము నష్టముకైనను ఓర్చుకొని కచ్చితమైన మనస్సాక్షి కలిగియుండేలా సహాయము చెయ్యమని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు పాదములు పట్టుకొని నిత్యమూ బ్రతిమాలు కుందాము. మనము ఆయనను మాత్రమే సంతోష పెట్టే కృప కొరకు ప్రార్ధన చేసికుందాము. దయతో ప్రార్ధించండి. సెయింట్ పాల్స్ మినిస్ట్రీస్ St . Paul s ministries
Posted on: Sat, 06 Dec 2014 04:07:51 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015