ఫణిగిరి- అపురూపమైన - TopicsExpress



          

ఫణిగిరి- అపురూపమైన బౌద్ధక్షేత్రం మేం, నేను, వేముగంటి మురళీకృష్ణ నిన్న 12.01.15 ఫణిగిరిని దర్శించాం దాదాపు 600 సం.లకు పైగా, క్రీ.పూ.300 నుండి క్రీ.శ.300 వరకు, తెలుగునాట ప్రభావవంతంగా వర్ధిల్లిన నిరుపమానదర్శనం బౌద్ధం. ఆనాటి తెలుగుప్రజలు బౌద్ధదర్శనాన్ని ఆదరించారు. ఆచరించారు. వాంగ్మయము, పురాతత్వ ఆధారాలు తెలంగాణాలో బౌద్ధం వ్యాప్తికి సాక్ష్యమిస్తున్నాయి. బుద్ధుడున్నకాలంలోనే బౌద్ధాన్ని తెలుగువాళ్ళు గౌరవించారనడానికి బావరికథ, సుత్తనిపాతము, విమాన వత్థాకథ, సింహళచరిత్ర, మహావంశ-పల్లవబొగ్గలు నిదర్శనాలు. చాలా బౌద్ధక్షేత్రాల్లో అశోకుడు శిలాస్తంభాలు ప్రతిష్టించాడు. బుద్ధునినిర్యాణానంతరం 84వేల స్తూపాలని దేశమంతట నిర్మించాడని కీర్తిపొందాడు. బుద్ధునికాలంలో మహాపురుషుల మరణాంతరం వారి అవశేషాలపై స్మారకచిహ్నంగా స్తూపాలు నిర్మించే సంప్రదాయమొకటున్నట్టున్నది.అందువల్లనే కావొచ్చు బుద్ధుడు తన శిష్యులకు తనకు కూడా స్తూపం నిర్మించమనిచెప్పినట్లుగా మహాపరినిర్వాణ సుత్తలో వున్న ‘ నన్ను చూసేవారు ధర్మాన్నీ చూస్తారు’ అనే వాక్యం అవకాశమిస్తున్నది.తెలుగునాట సనాతనంగా సమాధులు నిర్మించే ఆచారమున్నది. రక్కసిగుళ్ళ సంప్రదాయమే తర్వాతి కాలంలో కట్టిన స్తూపాలకు మూలమనిపిస్తున్నది. స్తూప్ అంటే పోగుచేయడ మనే అర్థముంది. పోగు చేసినవాటి మీద కట్టినవే స్తూపాలు. మొదటితరం స్తూపాలు నిరాడంబరంగా, చిన్నవిగా వుండేవి.గుండ్రని వేదిక, వేదికపై అండం, దానిపై హర్మిక, హర్మికలో ఛత్రము. వేదికకు నాలుగుదిక్కుల్లో ఆయకవేదికలు. వాటిమీద ఐదైదు లెక్కన ఆయకస్తంభాలు ఇరవైదాకా వుండేవి.తర్వాతి కాలంలో చైత్యకవాదం వచ్చింది.బౌద్ధదర్శన విశ్వాసాల్లో, ఆచారాల్లో వచ్చిన మార్పుల కారణంగా బుద్ధున్ని దేవుడిగా ఆరాధించబడ్డం వల్ల స్తూపనిర్మాణపద్ధతి మారిపోయింది. స్తూపవేదిక చుట్టు అందమైన బుద్ధగాథల శిల్పాలతో అలంకరించబడిన శిలాఫలకాల రాతితొడుగు కొత్తగా వచ్చింది. ఈ స్తూపాలలో బుద్ధుని (లేక బుద్ధగురువుల) శరీరావశేషాలతో కట్టిన శారీరకస్తూపాలు, బుద్ధుని వస్తువులపై (లేదా బుద్ధగురువుల వస్తువులకు) కట్టిన పారిభోజకస్తూపాలు, బుద్దున్ని లేదా బౌద్ధాన్ని గుర్తుకు తెచ్చే ఏ అవశేషాలు లేని ఉద్దేశికస్తూపాలని బౌద్ధస్తూపాలు మూడురకాలు. తెలంగాణాలో బౌద్థం చాలాచోట్ల విస్తరించింది. అప్పట్లో నిజాం రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ఖ్వాజా మహమ్మద్ అహమద్ నల్గొండ జిల్లాలో తిర్మలగిరి మండలంలో ఫణిగిరిగ్రామానికి ఆగ్నేయంగా వున్న గుట్టపై పెద్ద బౌద్ధారామాన్ని 1941లో కనిపెట్టారు.1944 వరకు అక్కడ తవ్వకాలు జరిపించారు కూడా. బౌద్ధవిహారాలు, బౌద్ధశిలాఫలకాలు, మట్టిపాత్రలు, బ్రాహ్మీలిపిశాసనాలు, శాతవాహన, ఇక్ష్వాకుల నాణేలు బయటపడ్డాయి. ఫణిగిరికి 5 కి.మీ. పరిధిలో వర్ధమానుకోట, తిరుమలగిరి, నాగారం, సింగారం, అరవపల్లి, ఆర్లగడ్డగూడేల దగ్గర బౌద్ధారామాల,విహారాల ఆనవాళ్ళు, బుద్ధవిగ్రహాలు,శిలామండపాలు లభించాయని పురావస్తుశాఖ నివేదికలు తెలుపుతున్నాయి. ఫణిగిరితవ్వకాల్లో ఆయకవేదికలు, స్తంభాలతో మహాస్తూపం, 6 విహారాలు, రెండు చైత్యగృహాలు, రెండు శిలామండపాలు, 7 మొక్కుబడి స్తూపాలు. క్రీ.పూ.1 వ శతాబ్దం నాటి బ్రాహ్మీశాసనం, అష్టమంగళ బుద్ధపాదాలు, బుద్ధప్రతిమలు, 40 సీసపు నాణేలు, రోమన్ చక్రవర్తి ఆగస్టస్ నాణెం, 42 శాతవాహన, ఇక్ష్వాకుల బ్రాహ్మీ శాసనాలు దొరికాయి. ఒక శాసనం ఇక్ష్వాకురాజు వీరపురుషదత్తుని 18 వ పాలనాసంవత్సర కాలం నాటిది. ఫణిగిరి మహాస్తూపం 4 వేదికలు అమరిన ఇటుకరాతి కట్టుకం. ఉత్తరాన 4 ఆయకస్తంభాలున్నాయి. మేదిని చుట్టూరా బౌద్ధశిల్పాలు చెక్కిన సున్నపురాతిపలకలు అలంకరించబడివున్నాయి. పెద్దస్తూపానికి దక్షిణం దిక్కున 7 ఉద్దేశికస్తూపాల ఆనవాళ్ళు బయటపడ్డాయి.ఇటుకరాళ్ళతో రెండు, గులకరాళ్ళతో మిగిలినవి కట్టబడి సున్నపుపూత పూయబడివున్నాయి. పెద్దస్తూపానికి వాయవ్యాన 2 చైత్యగృహాలు తూర్పుముఖంగా వున్నాయి. పెద్దఇటుకలు (24.16.8 అంగుళాల కొలతలతో), సున్నపుపూతతో కట్టబడ్డాయి.స్తంభాలు నిలబెట్టే గుంటలు, కప్పుపెంకల ముక్కలు, మెట్లతో ద్వారాలు, మెట్ల కింద చంద్రశిలలున్నాయి. భద్రత కొరకు బుద్ధజాతక కథలు చెక్కిన రాతిపలకలు, 8 పలకల సున్నపురాతి ఇక్ష్వాకుల శాసన స్తంభం, మరికొన్ని విగ్రహాల శిథిలాలు, స్తంభాల వేదికల వంటి వాటిని ఊరిలో ఒక ఇంట్లో భద్రపరిచివుంచారు. గుట్టకు పడమట వేంకటేశ్వారాలయం, ఈ గుట్టనానుకుని రామాలయం వున్నాయి. రామాలయం అందమైనగుడి. కాని పోషణలేదు. గుట్ట అంచులకు చెక్కిన గరుడ,హనుమంత, ఆళ్వారుల విగ్రహాలు ప్రత్యేకం. వూరిలో శివాలయం (త్రికూటం),విష్ణ్వాలయం, అమ్మదేవతల గుళ్ళు (ముత్యాలమ్మ వంటి), ఒక వీరగల్లును చూసాం. గుట్టపక్కన నీటివనరులుగా 3 చెరువులున్నాయి. గుట్ట మీద 3 కుండాలున్నాయి. ఒక కుండంలో ఇపుడు నీరు లభిస్తున్నది. గుట్ట మీద స్తూపపునర్నిర్మాణానికి తక్షణం నీటివసతి ఏర్పరచాల్సిన అవసరం వుంది. ఫణిగిరిగుట్ట పక్కగా భిక్కేరు పారుతుండేదిట. దాన్ని ఎందువల్లనో ఈటూరు వద్దనే మరలించారని ఫణిగిరిగ్రామస్తులు మాతో అన్నారు. ఇటీవల కొన్నిరోజుల క్రింద ‘‘‘నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని ఫణిగిరిలో పురావస్తు శాఖ తవ్వకాల్లో క్రీస్తుశకం మూడోశాబ్దం (ఇక్షాకుల కాలం) నాటి మహాక్షత్రప నాణెంతోపాటు నాటి బౌద్ధగురువు వినియోగించిన జపమాల ఆనవాళ్ళు లభ్యమైనాయి. కొద్దిరోజుల కిందటే మహాస్థూపంతోపాటు చిన్న స్తూపాలు, బౌద్ధగురువు కూర్చునే చైత్య , మహాస్థూలం (కామన్‌హాల్), బౌద్ధగురువులు ఉపయోగించిన వస్తువులతో నిర్మించిన పారిబోజక స్తూపం బయటపడ్డదంటున్నారు . అయితే ఇప్పటివరకు కాపర్, సిల్వర్ నాణేలు మాత్రమే లభించినా, తాజాగా జరిపిన తవ్వకాల్లో కాపర్, లెడ్ మిశ్రమంతో తయారైన పోషన్ కాయిన్స్ దొరకడం గొప్ప మలుపుగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.’’ ‘‘Relic casket is believed to be that of a Buddhist monk or an important disciple. According to their observation, the Deputy Director has said the Stupa, in which the relic casket was found, was renovated thrice -- during the Mauryan, Satavahana and Ikshvaku periods. The Department of Archaeology and Museums officials found the relic casket of a chief monk or an important person of Buddhism during the excavation of the Phanigiri Monastic Buddhist site in Nalgonda district on Tuesday. Speaking to The Hindu, Deputy Director J. Vijay Kumar said that they had been excavating the site since last February under the guidance of Director B. Srinivas. During the excavation they found a Mahastupa in which they found the relic casket. A valuable dull red ware earthen pot with silver container consisting of 11 miniatures beads, three silver and three thin flower petals were discovered at the north eastern corner of the Mahastupa at base of drum portion.’’ ఈనాడు, సాక్షి, ది హిందూ వంటి దినపత్రికల కథనం.
Posted on: Tue, 13 Jan 2015 07:38:24 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015