@ యూత్ Must Read & - TopicsExpress



          

@ యూత్ Must Read & Share ________________________ పైకి వాళ్లు చాలా సరదాగానూ.. కబుర్లు చెప్పుకుంటూనూ, జోక్‌లు వేసుకుంటూనూ గడిపేస్తున్నారు... కానీ లోపల్లోపల తీవ్రమైన వత్తిడితో ఒక్కోసారి చనిపోతే బాగుణ్ణు అని కూడా డిసైడ్ అవుతున్నారు. కొన్ని కోట్ల మంది ఎడ్యుకేటెడ్ యూత్ పరిస్థితి ఇది. పిల్లలకూ, పేరెంట్స్‌కీ మధ్య ఇంజనీరింగ్ చదువులు పూర్తయ్యే వరకూ మంచి అటాచ్మెంట్ ఉండేది. ఒక్కసారి ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే పేరెంట్స్ ఇబ్బందికరమైన చూపుల్ని తట్టుకోలేకా.. ఓ పక్క ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రాకా నరకం అనుభవిస్తున్న అబ్బాయిలూ, అమ్మాయిలూ ఎందరో!! అందరూ ఇంజనీరింగ్ చేస్తున్నారు.. US వెళ్లిపోతున్నారు అని ఇష్టం లేకపోయినా ఇంజనీరింగ్ చదివిస్తున్న తల్లిదండ్రులూ, కనీసం ఫేకల్టీకి కూడా ఏమీ సబ్జెక్ట్ స్కిల్స్ లేని, అస్సలు ప్రాక్టికల్ అప్రోచే లేని ఇంజనీరింగ్ కాలేజీలూ.. చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్‌ని చూసి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం అని మాస్ బంక్‌లూ, సినిమాలూ, ఛాటింగులతో కాలం గడిపేసి Software Development Life Cycle వంటి చిన్న చిన్న కాన్సెప్టులను కూడా థీరిటికల్‌గా చెప్పలేని అజ్ఞానంలో ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్న విద్యార్థులూ.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ విషయంలోనూ సవాలక్ష లోపాలు. ఎవర్నీ నిందించి లాభం లేదు. ఒకళ్లని అంటే మరొకళ్ల వైపు వేలు చూపిస్తారు. ----------- అన్నెం పున్నెం తెలీని పిల్లలు పాతికేళ్ల లోపే చచ్చిపోవాలనుకుంటున్నారు. సరైన గైడెన్స్ ఇచ్చే వాళ్లు లేరు.. ఏం చేయాలో తెలీదు.. కనీసం CV ప్రిపేర్ చేసి కంపెనీలకు అప్లై చెయ్యడం కూడా రావట్లేదు. నాకు తెలిసిన కొంతమంది HRలైతే ఇంటర్వ్యూలకు వచ్చే వాళ్ల నాలెడ్జ్ లెవల్ చూసి తెగ నవ్వుకోవాల్సి వస్తోంది అని చెప్తూ ఉంటారు. అసలు ఎక్కడ ప్రాబ్లెం? - తల్లిదండ్రులు ఎందుకు ఇంజనీరింగ్, మెడిసిన్‌లలో మాత్రమే జాయిన్ చేయించాలి? స్కిల్డ్ పీపుల్ లేని, డిమాండ్ చాలానే ఉన్న రంగాలు ఎన్నో ఉన్నాయి వాటి వైపు ఎందుకు ఆలోచించరు? - అస్సలు సబ్జెక్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్న ఆలోచన కూడా రానప్పుడు విద్యార్థులుగా మీకు చదువులెందుకు? టైమ్‌పాస్ చెయ్యడానికి కాదు కదా కెరీర్ ఉంది? లైఫ్‌లో ఎంత వేల్యుబుల్ డేస్ 4 సంవత్సరాలు? వాటిని ఎందుకు మీ ఫీల్డ్‌లో నాలెడ్జ్ పెంచుకోవడానికి వాడుకోవట్లేదు? ప్రతీసారీ కష్టపడమనీ, నాలెడ్జ్ పెంచుకోమని ఎవరు చెప్తారు, ఎంతకాలమని చెప్తారు? మీ లైఫ్ పట్ల మీకు బాధ్యత లేకపోతే ఎవరికి ఉంటుంది? - మీడియా సినిమాలూ, గాసిప్సూ, కబుర్లూ, పనికిమాలిన రాజకీయాలూ వంటి అంశాలతో విద్వేషాలూ రెచ్చగొట్టడం వల్ల ఎవరి జీవితాలు నాశనం అవుతున్నాయి? చాలా సెన్సిటివ్‌గా ఉండే యూత్ చదువులు మానేసి జీవితానికి అస్సలు అవసరం లేని ఎంటర్‌టైన్‌మెంట్, పాలిటిక్స్ వంటి విషయాలపై రోజులు రోజులు కాలం గడిపేయడం ఎంతవరకూ కరెక్ట్? - కొద్దిగా చదువుకుని, పిల్లలకు ధైర్యం చెప్పగలిగిన బంధువులూ, సమాజంలో ఉండే ప్రతీ ఒక్కరూ అస్సలు యూత్‌ని ఎందుకూ పనికిరాని వాళ్లని ద్వేషించడం మానేసి వాళ్లకి కొద్దిగా సున్నితంగా, వాళ్లకు అర్థమయ్యేలా కొద్దిగా ఓపిక చేసుకుని మంచి చెప్పడం ఎందుకు చెయ్యలేకపోతున్నాం? - ఇష్టం వచ్చినట్లు ఇంజనీరింగ్ కాలేజీలకు పర్మిషన్లు ఇచ్చేసి.. ఇంజనీరింగ్ విద్యని నాలిక గీసుకోవడానికి కూడా పనికిరాకుండా ఓ డిగ్రీ కన్నా ఘోరమైన స్థాయికి దిగజార్చి.. లక్షల కొద్దీ అస్సలు నాలెడ్జ్ లేని జనాల్ని తయారు చేసే ఫేక్టరీలుగా ఇంజనీరింగ్ కాలేజీల్ని తయారు చేస్తున్న కాలేజీల యాజమాన్యాలూ, ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం ఎప్పటికి సరిదిద్దబడుతుంది? ------------------- ఫ్రెండ్స్.. సినిమాల్లో పంచ్ డైలాగులతో మీ ఫ్రెండ్స్‌ని ఆటపట్టిస్తూ చాలా కూల్‌గా ఉంటున్నారు గానీ లోపల మీరు ఎంతగా నలిగిపోతున్నారో ఎవరికీ పైకి కన్పించట్లేదు. అలాగే ఆ వత్తిడి తట్టుకోలేక ఉన్న జోవియల్ నేచర్ పోగొట్టుకునీ.. క్రమేపీ ఎవరి ముందూ తల ఎత్తుకోలేక పిరికిగా జీవితం ముగిస్తున్న వాళ్లెందరో మీ చుట్టూనే మీరు చూస్తూ ఉన్నారు. అయిపోయిందేదో అయిపోయింది.. కనీసం ఇప్పటికైనా జీవితం పట్ల బాధ్యత తెలుసుకోండి.. కబుర్లు మానేసి నేర్చుకోండి.. మీ కెరీర్ ఇప్పటి నుండైనా మొదలెట్టండి. మీ పేరెంట్స్‌ని ఎలాగోలా ఒప్పించి ఓ ఏడాది grace పీరియెడ్ తీసుకోండి. ఏ ఏడాదిలో నిద్రహారాలు పక్కన పెట్టి, కబుర్లూ, సినిమాలూ పక్కనపెట్టి సబ్జెక్ట్ skills డెవలప్ చేసుకోండి. లేదా ఉద్యోగం రాదని అన్పిస్తుంటే.. స్వంత బిజినెస్ ప్లాన్ చేయండి.. ఏదైనా చేయండి.. ఫస్ట్ మీరు గెలవాలి.. మీ ఇంట్లోనూ, బంధువుల్లోనూ, ఫ్రెండ్స్‌లోనూ కన్పించే చులకన చూపుల్ని దాటేసి... ఏం ఎదిగిపోయాడురా.. అన్పించుకునేటంతగా ఖచ్చితంగా లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. గడిపేస్తూ పోతే లైఫ్ చాలా రొటీన్‌గా మారిపోతుంది.. వెంటనే ప్రయారిటీలు మార్చండి.. రొటీన్ మార్చండి.. నేర్చుకోండి.. స్కిల్స్ డెవలప్ చేసుకోండి.. కష్టపడండి.. అవకాశాలు వెదుక్కోండి.. అవకాశాలు లేకపోతే నవ్వుతూ ఇంకా అన్వేషించండి.. ఆశ ముఖ్యం.. ఖచ్చితంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. ఆల్ ది బెస్ట్!! - నల్లమోతు శ్రీధర్
Posted on: Tue, 15 Jul 2014 05:50:59 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015