విభజనకు అనుకూలంగా - TopicsExpress



          

విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే అందులో తాను భాగస్వామిని కాలేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి సూటిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. భాషాప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ మొదటిదని, భారత తొలి ప్రధాని నెహ్రూ ఏర్పాటు చేస్తే, దివంగత ఇందిరా గాంధీ ఎన్ని ఉద్యమాలు వచ్చినా కాపాడారని, స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ దానిని కొనసాగించారని, ఎపిలో డెబ్బై శాతం మందికి పైగా ప్రజలు సమైక్యాన్ని కోరుకుంటున్నారని కిరణ్ పెద్దలకు చెప్పారట.విభజిస్తే ఇరు ప్రాంతాల్లో పార్టీ నష్టపోతుందని, అలాగే ఇరు రాష్ట్రాలు నష్టపోతాయని వార్ రూమ్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్, కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌లకు కిరణ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. వారిద్దరితో కిరణ్ తన వాదనను ఘాటుగానే వినిపించారట. అయితే వాద ప్రతివాదాలకు తావులేదని, నిర్ణయం జరిగిందని, దాని అమలుకు సహకరించాలని వారు కిరణ్‌కు తేల్చి చెప్పారు.దీంతో... రాష్ట్ర విభజన ప్రక్రియలో తాను భాగస్వామిని కాదల్చుకోలేదని కిరణ్ వారికి స్పష్టంగా చెప్పినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిని కిరణ్ తన సన్నిహితుల వద్ద కూడా ప్రస్తావిస్తున్నారట. సిఎం చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారని, విభజన వ్యవహారంలో భాగస్వామిని కాలేనని చెప్పారని అంటున్నారు. డిగ్గీ, ఆజాద్‌లతో భేటీ అనంతరం కిరణ్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఆమెతో కూడా విభజన వద్దని చెప్పినట్లుగా సమాచారం. సమైక్యంగా ఉంచేందుకు దేనికైనా సిద్ధమని చెప్పారట.వార్‌రూమ్ భేటీ తర్వాత కిరణ్ కాస్త ముభావంగా ఎపి భవన్‌కు తిరిగి వచ్చారు. అక్కడ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు ఆయనను కలిశారు. కనీసం స్థానిక ఎన్నికలు ముగిసేదాకా నిర్ణయాన్ని ఆపాలని కోరినప్పటికీ అధిష్ఠానం పట్టించుకోలేదని కిరణ్ వారికి తెలిపారు. విభజనపై నిర్ణయం జరిగిపోయిందని, ఈ దశలో మనం చెప్పింది వినిపించుకునే పరిస్థితిలో వారు లేరని, జరిగిన నిర్ణయంపై చర్చవద్దని, మీకేం కావాలో చెప్పండి అని అడుగుతున్నారని, తాను చెప్పాల్సింది చెప్పి వచ్చానని కిరణ్ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.రాజీనామాలు చేసినా ఫలితం లేదని కూడా వారికి కిరణ్ చెప్పారట. కాగా, ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేముందు ముఖ్యమంత్రి అధినేత్రిని మరోసారి కలిశారు. మరోసారి తన వైఖరిని వివరించారు. అయితే, తెలంగాణను ప్రకటిస్తే రాజీనామా చేస్తామంటూ సీమాంధ్ర నేతలు హెచ్చరిస్తున్న తరుణంలో వారి వ్యవహారాన్ని చక్కదిద్దాలని సూచించారట. కిరణ్ మాత్రం విభజన ప్రక్రియలో భాగస్వామి కారాదని భావిస్తున్నారట Read more at: telugu.oneindia.in/talk-of-the-day/2013/i-don-t-want-be-part-this-process-120010.html
Posted on: Tue, 30 Jul 2013 21:02:19 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015