సిలిండర్‌ ఇక రూ.750! November 12th, - TopicsExpress



          

సిలిండర్‌ ఇక రూ.750! November 12th, 2014, 09:37 PM IST సిలిండర్‌ ఇక రూ.750! యూపీఏ హయాంలో ఏర్పడిన వంటింటి సంక్షోభం ఎన్డీయే హయాంలోనూ కొనసాగనుందా? ఎన్డీయే హయాంలో గ్యాస్‌ సిలిండర్ల సంక్షోభం మరింత తీవ్రం కానుందా? ఈ ప్రశ్నలకు ఔను అనే జవాబు ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. గ్యాస్‌ సిలిండర్ల సబ్సిడీ విధానంలో మార్పు తీసుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు గ్యాస్‌ సిలిండర్‌కు సబ్సిడీ ఇస్తున్నారు. దాని ప్రకారం 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌కు దాదాపు రూ.550 వరకు సబ్సిడీ లభిస్తోంది. వెయ్యి రూపాయల సిలిండర్‌ ఇప్పుడ రూ.440కే లభిస్తోంది. కానీ, ఇకనుంచి ఈ విధానం మారనుంది. ఇకనుంచి సిలిండర్‌కు కాకుండా కిలోల చొప్పున గ్యాసుకు సబ్సిడీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. కిలో గ్యాస్‌కు రూ.20 సబ్సిడీ ఇవ్వాలని కూడా యోచిస్తోంది. దాని ప్రకారం 14.2 కిలోల గ్యాస్‌కు కేవలం రూ.280 మాత్రమే సబ్సిడీ వస్తుంది. అప్పుడు 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ను వెయ్యి రూపాయలకు కొనుక్కుంటే ప్రభుత్వం మన బ్యాంకు అకౌంట్లలో రూ.280 మాత్రమే వేస్తుంది. అప్పుడు గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కోటి రూ.720 అవుతుంది. డెలివరీ బాయ్‌కి ఇచ్చే డబ్బులతో లపుకొంటే గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కోటి రూ.740 అవుతుంది. దాని ప్రకారం ఒక్కో సిలిండర్‌పైనా రూ.300 అదనపు భారం పడనుంది. వాస్తవానికి, యూపీఏ ప్రభుత్వం ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గ్యాస్‌ సిలిండర్లకు సబ్సిడీని ఆధార్‌ ద్వారా అందించడం. అదే తప్పును ఎన్డీయే కూడా చేస్తోంది. - See more at: telugu.gulte/tnews/6862/NDA-on-reducing-subsidy-on-gas-cylinders#sthash.rGd1M2Lq.dpuf
Posted on: Thu, 13 Nov 2014 04:26:10 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015