ఈ ప్రశ్నలకు - TopicsExpress



          

ఈ ప్రశ్నలకు బదులేది..? రాయలసీమ జేఏసీ కన్వీనర్ సీహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి *నాడు కర్నూలు ప్రజల త్యాగమే నేటి రాజధాని హైదరాబాదు.. అవునా కాదా..? *తాము ఆ నాడు తాము కర్నూలును త్యాగం చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు హైదరాబాద్ ఇలా వెలిగి పోయోదా? *1956లో రాజధానిని కోల్పోవడంతోనే బళ్లారిని కోల్పో యాం, అనంత సంపదను కోల్పోయాం, తుంగభద్ర నీటిని, ఆపార ఖనిజ సంపదను కోల్పోయాం తెలంగాణ రాష్ట్రం ఇస్తే మరి దీన్ని వెలకట్టి ఇవ్వగలరా? *కర్నూలు రాజధానిని త్యాగం చేశాక 60 ఏళ్లు అయినా తాము ఇంకా కట్టుబట్టలతోనే ఉన్నాం..విశాఖలో ఉక్కు కర్మాగారం తప్ప సీమాంధ్రలో ఒక్క భారీ పరిశ్రమ అయినా వచ్చిందా? *ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న రాయలసీమ విభజనతో మరింత ఎడారి కాదా? *కోస్తాంధ్ర, రాయలసీమలో మిగులు జలాల ఆధారిత ప్రాజెక్టులే ఉన్నాయి. విభజన జరిగితే చుక్క నీరైనా వస్తుందా?// బహుజన బంధు.
Posted on: Sun, 08 Sep 2013 18:34:42 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015