The Usual Suspects అనే సినిమా చూడక - TopicsExpress



          

The Usual Suspects అనే సినిమా చూడక పొతే చూడండి ,ఇది మన ఇంటలిజెన్స్ ని మనము ఒక సారి అనుమానంగా ప్రశించుకోవాల్సిన పరిస్థితి కల్పించే సినిమా . నాయర్ స్టైల్ లో సాగుతుంది ఈ మూవీ , ఈ సినిమా క్లైమాక్స్ చెప్పకూడదు ,కాని చెప్పేస్తా , కైజర్ అనే వాడు కాలిఫోర్నియా బీచ్ లో డ్రగ్స్ ఎక్స్చేంజి జరిగే ఒక షిప్ లో అందరినీ చంపేస్తాడు ,చివరికి షిప్ కి నిప్పు పెట్టి పారిపోతాడు ,ఆ ఇన్సిడెంట్ లో బతికి బట్ట కట్టే వాళ్ళు ఇద్దరు ,ఒకడు కాళ్ళు చచ్చు పడిపోయిన సెరబ్రల్ ప్లాజి అనే వ్యాధితో మేధకుడు అయిన రోజర్ వెర్బల్ కింట్ ,రెండో వాడు పూర్తిగా కాలిపోయి చావు బతుకుల్లో ఉన్న కోవాష్ అనే వాడు , పోలీసులు ఒక వైపు వెర్బల్ కింట్ ని ఇంటరాగేషన్ చేస్తుంటారు ,మరో వైపు కోవాష్ చెప్తున్న దానిని బట్టి నేరస్థుడి ఊహా చిత్రాన్ని గీస్తుంటారు ,ఇక వెర్బల్ ఇంటరాగేషన్ లో కళ్ళు తిరిగే స్టొరీ చెప్తాడు ,మొత్తం ఏమి జరిగింది అనేది కళ్ళకు కట్టినట్లు చెప్తాడు , కైజర్ ఎలా చంపాడో కూడా వివరిస్తాడు ,పోలీస్ లు చేసేదేమీ లేక ముందుగా ఒప్పుకున్నట్లుగా ఫుల్ ఇమ్యూనిటి ఇచ్చినందువలన వెర్బల్ కింట్ ని రిలీజ్ చేస్తారు , అతను బయటికి వెళ్లి పోయిన తరువాత ఆ ఆఫీసర్ ఒక్కసారి తన ఆఫీసుని పరిశీలిస్తాడు ,కింట్ స్టొరీ ఎలా చెప్పాడు అనుకుంటారు , ఆ రూమ్ లో ఉన్న బిల్ బోర్డు మీద పేపర్ క్లిప్స్ మీద నేమ్స్ , ఆఖరికి కాఫీ కప్ మీద ఉన్న రాసి ఉన్నది కూడా స్టొరీ లో కలుపుతాడు ,చుట్టు పక్కల కనపడే వాటితో స్టొరీ చెప్తాడు ,ఇంతలో హాస్పిటల్ లో ఉన్న కోవాష్ కైజర్ పోలికలు చెప్పడం పూర్తి అవుతుంది ,వెంటనే కోవాష్ చస్తాడు , ఆ ఊహ చిత్రం మన వెర్బల్ కింట్ లాగ ఉంటుంది , మన వెర్బల్ కింట్ యే కైజర్ ,ఇంకో విషయం ఏమిటంటే వాడు చెప్పినవి కూడా అన్ని నిజాలే ,కాని వాటిని వాడికి అనుకూలంగా మలుచుకొని రూమ్ లో ఉన్న objects తో కలిపి రచిస్తాడు ,బయటికి వెళ్ళిన తరువాత తన వంగిపోయిన కాళ్ళని మళ్ళీ నిలబెట్టి ఎంచక్కా నడిచి పోతాడు ,పరుగెత్తుకుంటూ బయటికి వచ్చిన ఆఫీసర్ కి చుక్కలు కనపడతాయి ,ప్రేక్షకులు మాత్రం వామ్మో వీడి అసాధ్యం కూలా అనుకుంటారు ,Kevin Spacey వెర్బల్ కింట్ లాగ నటిస్తాడు ,అసలు ఆ యాక్షన్ చూస్తే మనకు వళ్ళు జలదరిస్తుంది. గంగిరెద్దు లకి మల్లె ఎగురుతూ ,తొడలు గొట్టుకొని ,అడవి దున్నలకి మల్లె అరిసె మన తెలుగు సినిమా వాళ్ళు ఇంకో 20000000 సంవత్సరాలు పోయినా ఇటువంటి సినిమా తియ్యలేరు , జీవితం లో మరిచి పోలేని సినిమా ఇది
Posted on: Sun, 11 Aug 2013 04:50:14 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015