తెలంగాణాలో - TopicsExpress



          

తెలంగాణాలో టి.వి.9,ఎ.బి.ఎన్ ఛానెళ్ళను పునరుద్ధరించాలి! జాప్ తూ.గో.జిల్లా శాఖ ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా (వారధిబ్యూరో,కాకినాడ) ఢిల్లీలో తమ నిరసనను తెలుపుతున్న జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని, తెలగాణాలో టి.వి-9, ఎబిఎన్ ప్రసారాలను నిలిపి వేయడాన్ని నిరసిస్తూ సోమవారం కాకినాడలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేష్ (జాప్) ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. వెంటనే టీ-9, ఎబిఎన్ ప్రసారాలను తెలంగాణాలో పునరుద్ధ్రించేలా ఎపి సి.ఎం చంద్రబాబు చొరవ చూపాలని జాప్ జిల్లా కన్వీనర్ చేతన డిప్యూటి సి.ఎం, హోం మంత్రి ఎన్.చినరాజప్పను కోరారు. ఈ సందర్భంగా వినతి పత్రాన్ని ఆయనకు జర్నలిస్టులు అందజేశారు. అలాగే జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ కు వినతి పత్రాన్ని జర్నలిస్టులు కోరారు. జాప్ నాయకులు పి.ఎస్.ఎం.కృష్ణం రాజు, జె.వి.కె.అప్పలరాజులు ఈ ధర్నాకు సారధ్యం వహించారు. ఈ నిరసనోద్యమాన్ని ఎపియుడబ్ల్యుజె జిల్లా అధ్యక్షుడు కె.స్వాతి ప్రసాద్,ఎపియుడబ్ల్యు (ఎఫ్) జిల్లా అధ్యక్షుడు బి.సత్యంబాబు, సాయి, ఫణీంద్ర సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.వి-9 స్టాఫ్ రిపోర్టర్ వర్మ, ఎబిఎన్ స్టాఫ్ రిపోర్టర్ శివరాం, జర్నలిస్ట్ నాయకులు పి.మోజేష్, బొడ్డు వెంకట రమణ, ఎన్.రోనాల్డ్, వి.రమణ, శ్రీకాంత్, టి.వి9 కెమేరామేన్ ప్రసాద్, ఇంకా అనేక మంది జర్నలిస్టులు పాల్గొన్నారు.
Posted on: Mon, 08 Sep 2014 10:09:36 +0000

Trending Topics



s-as-minhas-Mas-isso-é-topic-475086229241248">Natascha Socha, faço de suas palavras as minhas!!! "Mas isso é
Douglass Doggie-Rama The best thing about spending our afternoons
Pelatih Mariners Ucapkan Terima Kasih Atas Tekanan
We stay a while at the stud’ Janow Podalski’ in Poland. The
In 2011 we came together to make tough choices to fix our pension

Recently Viewed Topics




© 2015