ప్రజలెప్పుడూ - TopicsExpress



          

ప్రజలెప్పుడూ మంచివాళ్ళే .... వాళ్ళని నడిపించే నాయకులే సరైన రీతిలో దిశా నిర్దేశం చెయ్యవలసి ఉంటుంది అందుకు ముందు ఆ నాయకులకు సరైన vision ఉండాలి... కానీ మన దేశంలో రాజకీయాలను పాలనా వ్యవస్థను నియత్రిస్తుంది మాత్రం పెట్టుబడిదారీ సంస్థలు , డబ్బు , ఆధిపత్య కులాలు .... కాలానుక్రమంలో ఎన్నిక ప్రక్రియలో ఒక కుట్రపూరితమైన మార్పు జరిగింది .. ఈ దేశంలో డబ్బు ఉన్న పెట్టుబడిదారులు , భూస్వాములు పాలకులుగా పేదవారు పాలితులుగా విభజించబడ్డారు...అంటే ఇది మోసం .... ఇది ప్రజాస్వామ్యం పేరుతో నడపబడుతున్న రాచరికమే ....!! ఏసి గదుల్లోనూ , ఎయిర్ క్రాఫ్ట్ విమానాల్లోనూ చక్కర్లు కొట్టే రాజకీయ నాయకులకు పేదవారి కష్టాలు అసలు అర్ధం అవుతాయా ? మరి దీన్ని మార్చాలి అంటే ....! నవసమాజ నిర్మాణానికి పునాదులు వేయాలి అంటే ....! అంబేద్కర్ , కాన్షీరాం గారు లాంటి సంస్కర్తలు లేరుగా ..! అందుకు మనమే మన వీధికి , మన ఊరికి , మన రాష్ట్రానికి , మన దేశానికి ఒక అంబేద్కర్ లా ఒక కాన్షీరాం లామారాలి .... మార్పు అనివార్యం ... అది ఈ రోజే జరగక పోవచ్చు 50, 100, 500 యేళ్ళకు మార్పు వస్తుంది .. ఆ మంచి మార్పుకు కారణమయ్యే చైతన్యాన్ని రగిలిస్తూ చరిత్ర పుటలలో మనమూ ఒక బిందువుగా మిగిలిపోవటం గొప్పవిషయం ... నవసమాజ , సమసమాజం నిర్మాణం కావాలి అంటే, సమస్యల పట్ల అవగాహన పరిష్కారాల పట్ల ఒక క్లారిటీ ఉంది ప్రజలను బిడ్డల్లా ప్రేమించే సహనం ఉన్న నాయకులు కావాలి .... అందుకు సమాధానమే మన కదిరే కృష్ణ .... విద్యావేత్త , మేధావి , యువకుడు ప్రజాసమస్యలపై ఒక అవగాహన ఉన్న సామాన్యుడైన మనలోనుంచి తయారైన ఒక నాయకుడే మన కదిరే కృష్ణ ... సమధర్మం నా లక్ష్యం అంటూ ఒక కమిట్మెంట్ తో ముందుకు సాగుతున్న కదిరే నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి నిజంగా నేను గర్వపడతాను .... కృష్ణా నీ లక్ష్యం నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ -----------------------------------------------------------ప్రియా కారుమంచి .....
Posted on: Sat, 26 Apr 2014 04:33:51 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015