A poem for today: ఋతువురాగానే రైతు - TopicsExpress



          

A poem for today: ఋతువురాగానే రైతు నేలని నాగలితో పలకరించినట్టు, నా హృదయచర్మాన్ని గిలిగింతలు పెడుతున్న అనాది కూజితం తక్కిన ప్రపంచమేమైపోయిందో తెలియదు. రైతు పొలం దున్నుతున్నట్టు, దిగంతం నుండి దిగంతానికి చాళ్ళు తీస్తున్నది, ఒక వడ్రంగిపిట్టలాగా నా సమస్తస్మృతి కోశపు తలుపులు తడుతున్నది కోకిల రైతు పొలంలో గింజలు విత్తి పంటకోసం ఏడాది ఎదురుచూస్తాడు. నాలో ఇప్పుడే ఒక నీవారాంకురాన్ని నిద్రలేపి, ఇంతలోనే గంపలకొద్దీ పంట బళ్ళకెత్తుతున్నది కోకిల
Posted on: Fri, 21 Jun 2013 03:26:42 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015