ఆండ్రాయిడ్ vs iOS గూగుల్ - TopicsExpress



          

ఆండ్రాయిడ్ vs iOS గూగుల్ ఆండ్రాయిడ్ OSని తీసుకుని Samsung, Sony, HTC వంటి పెద్ద కంపెనీలు మొదలుకుని Micromax, Celekon వంటి చిన్న చిన్న సంస్థల వరకూ ప్రతీ వాళ్లూ డివైజ్‌లు తయారు చేయడం వల్ల ఎక్కడ చూసినా ఆండ్రాయిడ్ ఫోన్లు కన్పిస్తున్నాయి గానీ.. Samsung Galaxy S4, Note 2, Note 3, కొన్ని Sony, HTC మోడళ్లలో తప్పించి సరైన రెస్పాన్సివ్‌నెస్‌ని నేను ఇంతవరకూ ఏ డివైజ్‌లోనూ చూడలేదు. దీనికి కారణం ఆయా కంపెనీలు తక్కువ ఇంటర్నల్ మెమరీ, RAM, ప్రాసెసర్ వేగం వంటి స్పెసిఫికేషన్లలో ఎంత లేటెస్ట్ ఆండ్రాయిడ్ OSని పెట్టి అమ్మినా WhatsApp, Facebook, Skype, Temple Run వంటి నాలుగైదు హెవీ అప్లికేషన్లు వేయగానే ఫోన్ lag మొదలవుతుంది. Tapలకు వెంటనే స్పందించక మన సహనాన్ని పరీక్షిస్తుంటుంది. IPhoneల విషయంలో Apple అనుసరిస్తున్న స్ట్రేటజీ మాత్రం ఇప్పటికీ, ఎప్పటికీ తిరుగులేనిదనే చెప్పుకోవాలి. ఏపిల్ తన OSని కేవలం ఐఫోన్లకి మాత్రమే తయారు చేస్తుంది. తాను తయారు చేసే మోడళ్లు ఏపిల్‌కి తెలుసు.. వాటి హార్డ్‌వేర్ పరిమితులూ తెలుసు.. ఏ ఫోన్ మోడల్ ఏ OS వరకూ చాలా స్మూత్‌గా రన్ అవ్వగలుగుతుందో తెలుసు. సో కొత్త OSని విడుదల చేసేటప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవడం కారణంగా ఇలా Tap చేస్తే క్షణంలో ఎంత హెవీ అప్లికేషన్ అయినా ఓపెన్ అయ్యేలా గొప్ప అనుభూతిని మనం పొందగలుగుతున్నాం. గతంలో కొన్నాళ్లు iPhone 4S వాడాను, ప్రస్తుతం పూర్తి స్థాయిలో iPhone 5 వాడే అవకాశం దొరికింది. ఇప్పటికే Samsung Galaxy Tab 2, Note 1, Note 2, Galaxy Fit వంటి అనేక ఆండ్రాయిడ్ డివైజ్‌లు చాలారోజుల పాటు వాడిన తర్వాత iPhoneలకు ఆండ్రాయిడ్ ఏ డివైజూ సాటిరాదు అన్న అభిప్రాయం కలిగింది. కస్టమైజేషన్, ఎక్కువ పెయిడ్ అప్లికేషన్లు మాత్రమే లభించడం వంటి కొన్ని కొన్ని పరిమితులు ఉన్నా iOS తీరే వేరు. ఈ గొప్పదనం ఏపిల్‌దే. - నల్లమోతు శ్రీధర్
Posted on: Sat, 25 Jan 2014 15:57:58 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015