టీ ఆర్ ఎస్ భయ పడాల్సిన - TopicsExpress



          

టీ ఆర్ ఎస్ భయ పడాల్సిన సమయం కాంగ్రెస్ నేతలు ఊళ్లలో తిరిగే పరిస్ధితి లేదు అన్న కె సీ ఆర్, పల్లె కి వెళ్లే స్ధితి లేకే నేతలు ఇక్కడ ఉంటున్నారన్న కోదండరాం లు ఇప్పుడు జవాబు చెప్పాలి. ఏకగ్రీవాలలో నేతలు అక్కడికి రాకపోతే ఈ ఇద్దరు వెళ్ళి అక్కడ కాంగ్రెస్ ని గెలిపించారా/ మాటల మూతలు విసిరి అబద్దపు కబుర్లు చెబుతున్న విషయం ఒప్పుకుంటారా? దబాయింపు సెక్షన్ ఆగుతుందా? ఇక్కడ తెలిసిన విషయం ఒక్కటే. తెలంగాణ లో టీ ఆర్ ఎస్ కూడా పోటీదారు. పల్లె ఓటు పెట్టుబడిగా సాగే ఈ ఎన్నికలలో వచ్చే స్ధానాలు భవిష్యత్తు రాజకీయానికి లిట్మస్ టెస్ట్. ఉద్యమం పతాక స్ధాయికి చేరి ఎవరు ఇక్కడ లేరు అంతా మేమే అని చెప్పుకునే టైమ్ లో లిస్ట్ లో లాస్ట్ సీట్లో కూర్చుంటే ఏం హవా? తెలంగాణ మొదటి ద్రోహి అని చెప్పిన కాంగ్రెస్ అత్యధిక స్ధానాలు, రెండవ ద్రోహి అని చెప్పిన టీ డీ పీ రెండవ స్ధానానికి చేరితే అక్కడ వై సీ పీ కి ఉనికే లేదని చెప్పిన నేతల సాక్షిగా ఆదే పార్టీ తో ఇప్పుడు టీ ఆర్ ఎస్ యుద్దం చేస్తోంది. గ్రౌండ్ లెవెల్లో జరుటుతున్న ఈ ఎన్నికలలో గెలిచిన వాళ్ళు అంతా తెలంగాణ వాళ్లే గా అని కొత్త పల్లవి అందుకునే కాకమ్మ కబుర్లు కాకుండా పల్లెల్లో మిమ్మల్ని కాదని ఇతర పార్టీలకి ఏకగ్రీవాలు చేస్తున్నారు అంటే ఆన్సర్ ఏమిటో ఆలోచించుకోండి. డబ్బులతో కొన్నారు అని పోచికోలు కబుర్లు చెబితే అసహ్యంగా ఉంటుంది. తెలంగాణ ఓటరు అమ్ముడు పోయారని చేపినట్లు అవుతుంది. ఉద్య్గమ0 కంటే సొమ్ములు ప్రధానం అని తెలినట్లు ఉంటుంది. జర జాగ్రత్త.
Posted on: Thu, 18 Jul 2013 07:39:11 +0000

Trending Topics



Recently Viewed Topics




© 2015